
దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూత్మక ప్రాంతంగా హైదరాబాద్, అప్రమత్తం
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ అప్రమత్తం
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బుధవారం తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తో పాటు అందుబాటులో ఉన్న స్థానిక మిలిటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సీఎం సమీక్షిస్తారు.
ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దు
ప్రజలు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని కోరారు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని సీఎం సూచించారు.ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షజరిపారు. ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్కకు సీఎం రేవంత్ ఫోన్ చేశారు. ఢిల్లీ నుంచి తక్షణం బయలుదేరి హైదరాబాద్ రావాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.
దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతం
దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున, డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్నందున తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్నీ విభాగాలకు సీఎం దిశానిర్ధేశం చేశారు.బుధవారం సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను స్వయంగా పర్యవేక్షించనున్నారు.
సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలంగాణలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిక్ చేపట్టనున్నారు. బుధవారం సాయంతంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు మాక్ డ్రిల్ ఉంటుంది.
తేదీ: 07.05.2025
మాక్ డ్రిల్ కార్యక్రమాలు
సమయం: సాయంత్రం 4:00 గంటలకుహైదరాబాద్ నగరం (ORR లోపల) మొత్తం సైరన్లు ఆన్ చేయడం ఇండస్ట్రియల్ సైరన్లు, పోలీస్ మైకులు (చౌరస్తాల వద్ద) వాహనాలు, ఫైర్ సైరన్లు మొదలైనవి సరిగ్గా 4:00 గంటలకు వినిపిస్తారు. పోలీస్, ఫైర్, మెడికల్, పరిశ్రమల శాఖలు అన్ని సైరన్లు నగరంలో ఒకేసారి 2 నిమిషాలపాటు ప్రారంభం అవుతాయని నిర్ధారిస్తారు.
ప్రజలు,వాలంటీర్లకు సూచనలు
సైరన్ విన్న వెంటనే, వేగంగా కానీ శాంతంగా స్పందించాలి.తక్షణం ఆశ్రయం పొందడం బహిరంగ ప్రదేశాల నుంచి తప్పించుకుని, గట్టి భవనం లేదా షెల్టర్ లోకి ప్రజలు వెళ్లాలి.పుకార్లను నివారించండి...అధికారిక సూచనలు మాత్రమే అనుసరించాలని పోలీసులు కోరారు. విద్యుత్, గ్యాస్ ఆఫ్ చేయండి – ఇంట్లో ఉంటే ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్, స్టౌవ్స్ లేదా అగ్ని సంబంధిత పరికరాలను ఆఫ్ చేయాలని సూచించారు. సురక్షితం అయ్యే వరకు అక్కడే ఉండండి – అధికారులు ప్రమాదం తీరినట్టు ప్రకటించే వరకు మీ ఆశ్రయంలో ఉండాలిబయట ఉంటే, దగ్గర్లో ఆశ్రయం లేకపోతే, తలని కప్పుకోవాలి. తగినంత రక్షణ పొందేందుకు ప్రయత్నించాలి.
మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు
మే 7న సాయంత్రం 4 గంటలకు వాస్తవ డ్రిల్ నిర్వహించనున్న 4 ప్రదేశాలు: సెక్టార్ గోల్కొండ కంటోన్మెంట్, కాంచన్ బాగ్, నాచారం
ఇదీ మాక్ డ్రిల్ మాత్రమే...
దేశవ్యాప్తంగా గుర్తించిన 244 జిల్లాల్లో హైదరాబాద్ ఒకటి. దేశవ్యాప్తంగా "ఆపరేషన్ అభ్యాస్" - సివిల్ డిఫెన్స్ వ్యాయామంలో భాగంగా మే 7న సాయంత్రం 4-4.30 వరకు ORR లోపల సైరన్ మోగుతుంది.పౌరులు భయపడాల్సిన అవసరం లేదని, ఇది భద్రతకు సంబంధించిన వ్యాయామం అని పోలీసులు చెప్పారు.
Next Story