తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల
x

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల

తెలంగాణ ఇంటర్ మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో కూడా బాలికలే పైచేయి సాధించారు.


తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రం వెంకటేశం బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఒకేషనల్ రిజల్ట్స్ ప్రకటించారు.

ఫస్ట్ ఇంటర్ లో 2,87,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. పాస్ పర్సంటేజ్ 60.01 శాతం ఉంది. ఇక సెకండ్ ఇంటర్ లో 3,22,432 మంది ఉత్తీర్ణులు కాగా... పాస్ పర్సంటేజ్ 64.19 శాతం ఉంది. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి. https://results.cgg.gov.in/ & https://tsbie.cgg.gov.in/

రీ కౌంటింగ్, పేపర్ రీ వాల్యూయేషన్ కోసం ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు అవకాశం ఉంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 71.7% ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 31.81 % తో కామారెడ్డి ఆఖరి స్థానంలో నిలిచింది.

సెకండ్ ఇంటర్ ఫలితాల్లో 82.95 % ఉత్తీర్ణతతో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 44.29% తో కామారెడ్డి ఆఖరి స్థానంలో ఉంది.

మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 68.35% ఉండగా.. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 51.50% ఉంది.

ఇంటర్ సెకండ్ ఇయర్ లో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 72.53% ఉండగా.. అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 56.10% ఉంది.

Read More
Next Story