సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మేధావుల లేఖ
x

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మేధావుల లేఖ

అంబేద్కర్ వర్షీటీకి చెందిన భూమిని ఇతర విద్యాసంస్థకు కేటాయించడంపై తెలంగాణ మేధావులు,విద్యావంతులు నిరసన వ్యక్తం చేశారు.ఈ మేరకు వారు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.


హైదరాబాద్ నగరంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేధావులు, విద్యావంతులు నిరసన తెలిపారు.

- ఇందులో భాగంగా తెలంగాణ మేధావులు, విద్యావంతులు 61 మంది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి శనివారం లేఖ రాశారు .అంబేద్కర్ వర్శిటీ భూమిని ఇతర యూనివర్శిటీకి కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించు కోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయనివారు పేర్కొన్నారు.

ఈ లేఖ రాసిన వారిలో దేశంలోని పలు విద్యాసంస్థల్లో పనిచేసిన మాజీ వైస్ ఛాన్సలర్ లు , డైరెక్టర్లు , మేధావులు , విద్యావంతులు ఉన్నారు . ఇందులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు ఆవశ్యకత , పేదలకు , మహిళలకు , బడుగు, బలహీన వర్గాలకు ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది వివరించారు. ఉన్నత విద్యా వ్యాప్తికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి ని వారు లేఖలో ప్రస్తావించారు .
లేఖ రాసిన వారిలో మాజీ వీసీలు ప్రొ. వి.ఎస్.ప్రసాద్ , ప్రొ .కె .సీతారామా రావు , ప్రొ .రాం చంద్రం, ప్రొ .వాయునందన్ , ప్రొ . వి .వెంకయ్య , తెలంగాణా తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొ .ఘంటా చక్రపాణి , ఎమ్మెల్సీ , ఓయూ మాజీ ప్రొఫెసర్ ప్రొ . కోదండ రాం, ప్రొ.నాగేశ్వర్ , ప్రొ .పద్మజా షా లతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ , హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ , సీఫెల్ , కాకతీయ , మౌలానా ఉర్దూ యూనివర్సిటీలతో పాటు పలు విద్యా సంస్థల ప్రొఫెసర్లు ఉన్నారు .


Read More
Next Story