
తెలంగాణ హైకోర్టు
‘హైడ్రా’కు తెలంగాణ హైకోర్టు షాక్
తెలంగాణ హైకోర్టు హైడ్రాకు మరో సారి షాక్ ఇచ్చింది.
హైదరాబాద్ నగరంలోని జూబ్లీ ఎన్ క్లేవ్ లో ఈ నెల 23వతేదీన హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్ క్లేవ్‌లో స్వాధీనం చేసుకున్న స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని, అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని కోర్టు ఆదేశించింది.ఆ స్థలం ప్రైయివేటుదని తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని హైడ్రా, జీహెచ్ ఎంసీ, పురపాలక శాఖ, జూబ్లీ ఎన్ క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లకు స్పష్టం చేసింది.
పార్కు లేదని ప్రభుత్వం స్పష్టం చేసినా...
మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్ క్లేవ్‌లో వై.వెంకటరెడ్డి, వై.జగాల్‌రెడ్డిలు పార్క్ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఆగస్టు 23వ తేదీన తెల్లవారు జామున హైడ్రా కూల్చివేసింది. ఆ వెంటనే ఆస్థలం చుట్టూ హైడ్రా పెన్షింగ్ వేసి బోర్డులు పాతింది. దీనిపై వై.వెంకటరెడ్డి, వై.జగాల్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు.
వాస్తవంగా హైడ్రా కూల్చివేసిన భూమి 2004 సీలింగ్ సర్‌ప్లస్ ల్యాండ్ అయింది. అప్పట్లో కొంత మంది పెద్దలు తమ అధికార బలంతో సీలింగ్ భూమిలో అక్రమంగా లేఅవుట్ వేశారు. దీనిని అప్పటి హుడా 2006లో సీలింగ్ భూమిలో లేఅవుట్ ఇవ్వడం కుదరదని చెప్పి తిసర్కరించింది. ప్రభుత్వం 2008లో జైహింద్ రెడ్డి కుటుంబ సభ్యులకు రెగ్యులరైజ్‌చేస్తూ జీవో ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వం 2012లో ఆ స్థలంలో పార్క్‌ను రద్దు చేసింది. క్రమబద్దీకరణ జీవోను రద్దు చేయాలని కొంత మంది హైకోర్టుకు వెళ్లగా 2015లో క్రమబద్దీకరణ జీవో సరైనదేనని తుది తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో 2013లో జూబ్లీ ఎన్ క్లేవ్ లేఅవుట్ రద్దు చేస్తూ మరో ఆదేశం కూడా కోర్టు ఇస్తూ సర్ ప్లస్ ల్యాండ్ లో లేఅవుట్ ఎలా వేస్తారని కూడా ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జీవోలు ఎగ్జిస్టెన్స్‌లో కి వచ్చాయి. దీనిపైన విజిలెన్స్ కమిటీ కూడా విచారణ చేసి ఈ భూమి వై వెంకటరెడ్డి, వై.జగాల్‌రెడ్డిలకే చెందుతుందని 2017లో విజిలెన్స్ రిపోర్టు రాశారు.
తాజాగా హైడ్రా వచ్చి ఇది పార్క్ స్థలం అంటూ కూల్చివేతలు చేపట్టింది.హైడ్రా కూల్చి వేతలపై సీరియస్ అయిన హై కోర్టు వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించాలని ఆదేశించింది. ఇది పార్క్ స్థలం అని నిర్థారించలేమన్నది. ఏ ఒక్కరు కూడా ఆ స్థలంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది.
Next Story