ఐఎఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్
x

ఐఎఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్

ఐఎఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలోని నలుగురు ఐఎఎస్ అధికారులు ఆంధ్రాలో, ఏపీలోని ముగ్గురు తెలంగాణలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.


తమను ఏపీకి కేటాయించడంపై హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది.క్యాట్ తీర్పుపై పిటిషన్ సమర్పించిన ఐఎఎస్‌లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఐఎఎస్ లు అయినంత మాత్రాన వెంటనే స్టే ఇవ్వాలంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.ఇలాంటి వ్యవహారంలో మేం జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది.

- ఐఎఎస్‌ల నియమకాలను కోర్టులు నిర్ధారించలేవని జడ్జి పేర్కొన్నారు.ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని హైకోర్టు అభిప్రాయ పడింది. ‘‘ముందు మీరు వెళ్లి రిపోర్టు చేయండి’’ అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- ‘‘మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు, ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దు...ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది’’అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
తెలంగాణలో పనిచేస్తున్న ఐఎఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ రిపోర్టు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.దీంతో హైకోర్టు లో ఏపీ ఐఏఎస్ లకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

తెలంగాణా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఎఎస్ అధికారులు హరి కిరణ్,సృజన,శివశంకర్ లు తెలంగాణకు వచ్చి రిపోర్టు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పనిచేస్తున్న ముగ్గురు సివిల్ సర్వెంట్లకు కూడా హైకోర్టు ఆదేశాలు

10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వండి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వాలని అఫిడవిట్ ను హైకోర్టులో సమర్పించాయి. ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అఫిడవిట్లు కీలకం కానున్నాయి. ఐఎఎస్ అధికారులను రిలీవ్ చేయడానికి 10, 15రోజుల సమయం కావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టును కోరాయి.

ఐఎఎస్ ల కేసు ఏమిటంటే...
- డీవోపీటీ సర్క్యులర్‌ను క్యాట్‌లో ఐఎఎస్ అధికారులు సవాల్ చేశారు. డీవోపీటీ సర్క్యులర్‌ను క్యాట్ సమర్థించింది.
- క్యాట్ తీర్పు‌పై స్టే ఇవ్వాలని, తెలంగాణ రాష్టంలో కొనసాగించేలా ఆదేశించాలని కోరిన ఐఎఎస్ అధికారులు లంచ్ మోషన్ పిటిషన్‌ ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ అభినందన్ కుమార్ శావలే ధర్మాసనం ఈ కేసును విచారించింది.


డీవోపీటీ,క్యాట్ నిర్ణయాలపై...

తమను ఏపీకి కేటాయించడంపై ఐఏఎస్‌ అధికారులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వారు దాఖలు చేశారు. ఆమ్రపాలి కాట, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌, సృజన, శివశంకర్, హరికిరణ్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణకు అనుమతించింది. ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది. క్యాట్‌ సభ్యులు లతా బస్వరాజ్‌ పట్నే, శాలినీ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన స్థానాల్లో ఈ నెల 16వతేదీలోగా విధుల్లో చేరాలని మంగళవారం క్యాట్ తేల్చి చెప్పింది. దీంతో క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు.




Read More
Next Story