ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక అలానే.. చెప్పిన పొంగులేటి
x

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక అలానే.. చెప్పిన పొంగులేటి

తెలంగాణలో అతి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభం కానుందని రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు.


తెలంగాణలో అతి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభం కానుందని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందు కోసం లబ్ధిదారులను ప్రత్యేక పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు మంత్రి. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఎంతో పారదర్శకంగా సాగనుందని, ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఈ యాప్‌ను శనివారం మంత్రి సచివాలయంలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. యాప్‌లో ఒకటి రెండు మార్పులు చేయాలని ఆయన చెప్పారు. ఆ మార్పులను పూర్తి చేసి వచ్చే వారం దీనిని లాంచ్ చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి.

యాప్ లాంచ్ అప్పుడే

‘‘కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తాం. ఇందుకు చేయాల్సిన అన్ని ఏర్పాటు తుదిదశకు చేరాయి. గ్రామాణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించాం. లబ్ధిదారుల ఎంపి నుంచి వారికి ఇళ్లు కేటాయించే వరకు అన్ని దశల్లో వీలైనంత వరకు సాంకేతికతను వినియోగించకోవాలి. పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం’’ అని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

కమిటీలు ఇలా..

సొంత ఇల్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కింద 4.5 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిలో స్థానికులతో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రవాణ, రోడ్డు, భవనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఛైర్మన్ గా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు మహిళలు, అందులో ఒకరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్థానికులు సభ్యులుగా, పంచాయతీ కార్యదర్శి కన్వీనరుగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయాలని జీఓ విడుదల చేశారు.

- మున్సిపల్ వార్డు స్థాయిలో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్ గా సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల నుంచి ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు మహిళలు, అందులో ఒకరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్థానికులు సభ్యులుగా, వార్డు ఆఫీసర్ కన్వీనరుగా ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

ఇందిరమ్మ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అర్హులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ఇళ్ల నిర్మాణానికి డబ్బును లబ్ధిదారుడికే అందించాలని ప్రభుత్వం కోరింది. ఇందిరమ్మ కమిటీ ఈ పథకంపై సోషల్ ఆడిట్ చేయాలని సూచించింది. అనర్హులకు ఇళ్లను మంజూరు చేస్తే ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం జీఓలో పేర్కొంది.

Read More
Next Story