డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్... కలెక్టర్లు కీలక ఆదేశాలు
x

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్... కలెక్టర్లు కీలక ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.


తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహిళా సంఘాలతో గవర్నమెంటు ఆఫీసులతో పాటు పలు ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్స్ ప్రారంభించింది ప్రభుత్వం. వారిని ఆర్ధికంగా మరింత బలోపేతం చేసేందుకు నాటుకోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు బ్యాంకులతో చర్చించి మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించనుంది.

ఆసక్తి, అర్హత ఉన్నమహిళలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకు 500 మంది డ్వాక్రా సభ్యులకు పాడి పశువులు అందజేయనున్నారు. దీనికి రూ. నాలుగున్నర కోట్లు ఖర్చు కానుంది. ఒక్కొక్క సభ్యురాలికి ఒకటి లేదా రెండు పాడి గేదెలను అందజేయనున్నారు. దీనికోసం లక్ష రూపాయలు రుణం ఇవ్వనున్నారు. అయితే పశువులను మేపుకునేందుకు అనువైన ప్రాంతం ఉన్న వారికే వీటిని మంజూరు చేయనున్నారు.

నాటుకోళ్ల పెంపకం ద్వారా కూడా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడానికి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. ఒక్కో జిల్లాకు 3 కోట్లతో రెండు వేల డ్వాక్రా గ్రూప్ సభ్యులకు నాటు కోళ్లను ఇవ్వనుంది. దీనికోసం ఒక్కొక్కరికీ రూ.15వేలు రుణం అందజేస్తారు. వీటి ద్వారా దాదాపు 100 వరకు నాటు కోళ్ల పిల్లలను తెచ్చి పెంచుకునే అవకాశం ఉండనుంది.

అంతేకాదు, కోళ్ల ఫారాలు పెట్టుకునేందుకు కూడా ఆర్థికసాయం చేయనున్నారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఒక్కో యూనిట్ కి రూ.రెండు లక్షల 91 వేలు రుణం ఇవ్వనున్నారు. సొంతంగా స్థలం ఉండి షెడ్డు వేసుకుని ఫారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే డ్వాక్రా గ్రూప్ మహిళలకు వీటిని మంజూరు చేయనున్నారు. కోళ్ల ఫారం నిర్వహణపైన వీరికి శిక్షణ ఇస్తారు.

అలాగే చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం రుణం మంజూరు చేయనుంది. పాల విక్రయ కేంద్రాలను సైతం మండలానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు అందజేయనుంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, రైతు బజార్లు ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో యూనిట్ కి రూ.లక్షా 90వేల రుణం ఇవ్వనున్నారు.

Read More
Next Story