
public distribution System|ప్రజాపంపిణీ వ్యవస్థలో తెలంగాణ ఫస్ట్
ప్రజాపంపిణీ వ్యవస్థలో వినూత్న విధానం అనుసరించిన తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా ప్రశంసా పురస్కారం లభించింది.కేంద్రమంత్రి నుంచి అవార్డు లభించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహార ధాన్యాల రవాణలో రూట్ ఆప్టిమైజేషన్ ను అమలు చేయడంతో కేంద్ర అవార్డు లభించింది. దేశంలోనే తెలంగాణ పౌర సరఫరాల శాఖ అమలు చేస్తున్న వినూత్న విధానం వల్ల ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది.
- ఆహార ధాన్యాల పంపిణీలో ప్రజా నిధులను ఆదా చేయడంతోపాటు లబ్దిదారులకు పారదర్శకతగా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. రేషన్ బియ్యం రూట్ ఆప్టిమైజేషన్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డీఎస్ చౌహాన్ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రజంటేషన్ ఇచ్చారు.
- రేషన్ బియ్యం రవాణపై జీపీఎస్ ట్రాకింగ్ వంటి అధునాతన పద్ధతులను అవలంబించారు. ఈ పద్ధతికి మెచ్చిన కేంద్రం తెలంగాణకు అవార్డునిచ్చి సత్కరించింది.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో ట్రైల్‌బ్లేజింగ్ ఇనిషియేటివ్‌లకు ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్.చౌహాన్ ను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిష్ఠాత్మకమైన ప్రశంసా పురస్కారంతో సత్కరించారు.
Next Story