Telangana| ఒక వైపు ఎన్‌కౌంటర్లు,మరో వైపు మావోయిస్టుల లొంగుబాట్లు
x

Telangana| ఒక వైపు ఎన్‌కౌంటర్లు,మరో వైపు మావోయిస్టుల లొంగుబాట్లు

2024 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర అడవులు వరుస ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తం అయ్యాయి.పలువురు మావోయిస్టులు నక్సలిజాన్ని వదిలి పోలీసుల ముందు లొంగిపోయారు.


కాలగమనంలో కలిసిపోనున్న 2024 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్‌కౌంటర్లు,మావోయిస్టుల లొంగుబాటు ఘటనలు జరిగాయి. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అడవుల్లో పలు ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయి.

- తెలంగాణ రాష్ట్రంలో 2024వ సంవత్సరం ఒక వైపు ఎన్ కౌంటర్లు, మరో వైపు మావోయిస్టుల లొంగుబాట్లతో ముగియనుంది. ఈ ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లలో 120 మంది మావోయిస్టులు హతం అయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 24 మంది మావోయిస్టులు హతం అయ్యారు. 2022వ సంవత్సరంలో 30మంది, 2021లో 47 మంది , 2020వ సంవత్సరంలో 36 మంది,2019లో 65 మంది మరణించారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత పదేళ్లలో జరిగిన ఎన్ కౌంటర్లలో 60మందికి పైగా మావోయిస్టులు మరణించారు.

ఎన్ కౌంటర్లలో- భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబరులో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు హతం అయ్యారు. తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే జరిగాయి.భద్రాద్రి జిల్లాలో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఆ తర్వాత ములుగు జిల్లాలో 17 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్లే కాదు మావోయిస్టుల లొంగుబాట్లు కూడా ఎక్కువగా జరిగాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

లొంగిపోవాలని పోలీసుల పిలుపు
పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అంటూ పోలీసులు మావోయిస్టుల కుటుంబసభ్యులను కలిసి కోరుతున్నారు. పోలీసుల పిలుపుతో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ సభ్యుడు వెట్టి లక్ష్మయ్య అలియాస్‌ కల్లు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మావోయిస్టు పార్టీ గొల్లపల్లి లోకల్‌ ఏరియా స్కాడ్‌ (ఎల్‌వోఎస్‌) సభ్యుడు మల్లం దేవా పోలీసుల ఎదుట లొంగిపోయారు.ఇద్దరు మావోయిస్టుల‌ను సుష్మిత‌, దూల‌ గతంలో పోలీసుల ముందు లొంగిపోయారు. సుష్మిత సెంట్ర‌ల్ క‌మిటీ స్టాఫ్గా, దూల ప్రొటెక్ష‌న్ టీం మెంబ‌ర్‌గా ప‌ని చేశారు.మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో సుష్మిత‌, దూల‌ మధ్య పరిచయం ఏర్పడటంతో 2020 మార్చి 30వ తేదీన వివాహం చేసుకున్నారు.మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని వీరిద్ద‌రూ వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణలోనే అత్యధికంగా ఎన్ కౌంటర్లు జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు ఏరియా కమిటీ సభ్యుడు, దళ సభ్యుడు పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టులు పూనెం పాక్లి, వెట్టి దేవ అలియాస్ బాలు, మడకం ఉంగి అలియాస్ గంగి, రవ్వ సోమ, మడివి గంగిలు శనివారం లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై లక్షల రూపాయల రివార్డులు కూడా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు చెప్పారు.


Read More
Next Story