వరద బాధితులకు కాంగ్రెస్ నేతల 2 నెలల జీతం విరాళం
x

వరద బాధితులకు కాంగ్రెస్ నేతల 2 నెలల జీతం విరాళం

తెలంగాణాలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి.


తెలంగాణాలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం విరాళం ప్రకటించింది. 2 నెలల జీతం విరాళంగా ప్రకటించారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల రెండు నెలల జీతాన్ని ఇస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

క్రెడాయ్ కోటి విరాళం..

వరద బాధితుల సహాయం కోసం క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆదివారం క్రెడాయ్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు రేవంత్ క్రెడాయ్‌ని అభినందించారు.

మానవత్వం ప్రదర్శించండి... -సీఎం

వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు. తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, చెక్కుల రూపంలోగానీ లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి పంపవచ్చు అని ఒక క్యూఆర్ కోడ్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విరాళాలు అందించే సంస్థలకి సపరేట్ క్యూఆర్‌ కోడ్‌ ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Read More
Next Story