మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం.. ఎన్ని కోట్లతోనంటే..!
x

మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం.. ఎన్ని కోట్లతోనంటే..!

మెట్రో రెండో దశ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇతర మార్గాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మెట్రో రెండో దశ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇతర మార్గాలకు కూడా మెట్రో సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌కు రాష్ట్ర మంత్రివర్గం తమ తాజాగా సమావేవంలో ఆమోద ముద్రవేసింది. రెండో దశ మట్రో ప్రాజెక్ట్‌ను రూ.24,269 కోట్ల వ్యయంతో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను తమ హయాంలోనే అంటే మిగిలున్న నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. మెట్రో లైన్ మొదటి దశలో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర సేవలందిస్తోంది. మొదటి దశ మెట్రో ప్రాజెక్ట్ భాగస్వామ్య విధానంతో రూ.22వేల కోట్ల వ్యవయంతో పూర్తయింది. ప్రస్తుతం మెట్రో సేవలను 5 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నారు. రెండో దశ మెట్రో రైలు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరంలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మూడో దశ మెట్రో కూడా పూర్తి..

‘‘గత ప్రభుత్వం మెట్రో విస్తరణను ఏమాత్రం పట్టించుకోలేదు. కొన్నికొన్ని నగరాలు రెండో దశ, మూడో దశ మెట్రో విస్తరణను కూడా పూర్తి చేసుకున్నాయి దీంతో మెట్రో సేవలను అందించడంలో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉండే హైదరాబాద్ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్‌ను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, పూణె, నాగ్‌పూర్, అహ్మదాబాద్ నగరాలు అధిగమించాయి. కాగా రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై ప్రత్యేక దృష్టిసారించింది. రెండో దశ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేసింది. ఈ రెండో దశ ప్రాజెక్ట్‌లో మెట్రో రలు ఐదు కారిడార్లతో 76.4 కిలోమీటర్ల మేర సేవలను అందించనుందని డీపీఆర్ వివరిస్తోంది. మెట్రో రెండో దశ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది’’ అని ప్రభుత్వం వెల్లడించింది.

మెట్రో కారిడార్లు ఇవే..

మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను తొలుత తొమ్మిది కారిడార్లతో ప్లాన్ చేశారు. అవేంటంటే.. మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ ప్రాజెక్ట్‌లో భాగంగా విమానాశ్రయం నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో ట్రాక్ నిర్మాణం జరగనుంది. కారిడార్-4లో.. నాగోల్-ఆర్‌జఐఏ(ఎయిర్ పోర్ట్ కారిడార్) వరకు 36.6 కిలోమీటర్ల వరకు , కారిడార్-5లో రాయదుర్గ్-కోకాపేట్ నియోపోలీస్వరకు 11.6 కిలోమీటర్ల వరకు, కారిడార్-6లో ఎంజీబీఎస్-చాం్దరాయన్‌గుట్ట వరకు (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కిలోమీటర్ల వరకు సాగనున్నాయి. కారిడార్-7లో మియాపూర్-పటాన్ చెరు వరకు 13 కిలోమీటర్ల వరకు, కారిడార్-8లో ఎల్‌బీనగర్-హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు, కారిడార్-9(ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్)లో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల దారిని కవర్ చేస్తాయి.

మొత్తం 24 స్టేషన్లు

మెట్రో ప్రాజెక్ట్ రెండో దశలో ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయన్ గుట్ట, మైలార్దేవ్ పల్లి, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా ఎన్.హెచ్ మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ లైన్ వరుసగా నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రో లైన్లకు అనుసంధానించబడుతుంది. ఈ కారిడార్ మొత్తం 36.6 కి.మీ పొడవులో, 35 కి.మీ ఎలివేట్ చేయబడుతుంది. అలాగే 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ ఎయిర్ పోర్ట్ స్టేషన్తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి.

Read More
Next Story