లండన్‌ వీధుల్లో పోతురాజు నృత్యాలు... బోనమెత్తిన మహిళలు
x

లండన్‌ వీధుల్లో పోతురాజు నృత్యాలు... బోనమెత్తిన మహిళలు

లండన్ లో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (TAUK) ఆధ్వర్యంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు.


లండన్ లో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (TAUK) ఆధ్వర్యంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. వెస్ట్ లండన్‌లోని హెస్టన్ స్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. సికింద్రాబాద్‌లో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే ‘లష్కర్ బోనాలు’ వాతావరణాన్ని లండన్ లో తీసుకొచ్చినట్టు ఎన్నారైలు తెలిపారు.

సంప్రదాయ పోతురాజు వేషధారణలో నృత్యాలు, లండన్‌లోని పలు వీధుల్లో మహిళలు బోనం మోస్తూ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. యుకె లోని వివిధ ప్రాంతాల నుండి 1000 కంటే ఎక్కువ ఎన్నారై కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టాక్ (టీఏయూకే) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు శుష్మునా రెడ్డి ప్రసంగాలతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి టీఏయూకే ఉపాధ్యక్షులు సత్యమూర్తి చిలుముల అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హౌన్స్‌లో డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ తెలంగాణ పండుగ బోనాలు వేడుకల్లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. టాక్ తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో ప్రచారం చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని, స్థానిక సమాజ సేవలో వారి భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని, దుర్గామాత ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

ప్రతి సంస్కృతికి సామరస్యం, శాంతి, గౌరవం నెలకొల్పేందుకు స్థానిక బ్రిటీష్ నివాసితులు పాల్గొని భారతీయ సంస్కృతిని, ప్రత్యేకించి తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించేందుకు, ప్రోత్సహించేందుకు లండన్ వీధుల్లో ఎన్నారై మహిళలు బోనం మోసుకెళ్లడం తనకు ఎంతో గర్వకారణమని డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.

రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై ప్రచారం చేసేందుకు టాక్ కట్టుబడి ఉందని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో మార్గనిర్దేశం చేసి, మద్దతుగా నిలిచినందుకు ఎమ్మెల్సీ కవితకి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Read More
Next Story