బీఆర్ఎస్ కి గుడ్ న్యూస్.. కవితకి బెయిల్
x

బీఆర్ఎస్ కి గుడ్ న్యూస్.. కవితకి బెయిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ,సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా... ఈడీ తరపున ఏఏసీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈడీ, సిబిఐ కేసులో కవితకి బెయిల్ ఇచ్చింది.

గత వారం ఈడీపై సుప్రీం సీరియస్...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఆగస్టు 20న విచారణ చేసిన సుప్రీం... ఈ నెల 27కు విచారణ వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కె. విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ఈడి మరికొంత సమయం కోరడంతో అత్యున్నత న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

మరోవైపు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. ఈనెల 27 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే శుక్రవారం లోపు కవిత తరపు న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని సూచించింది. విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి.. మహిళగా కవిత బెయిల్ కి అర్హురాలని తెలిపారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ పూర్తయిందని, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసినందున బెయిల్ మంజూరు చేయాలని రోహత్గి కోరారు.

Read More
Next Story