Harish Rao | అసెంబ్లీలో హరీష్ రావు సంచలన డిమాండ్.. (వీడియో)
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అసెంబ్లీకి తాగొచ్చారా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా నువ్వానేనా అన్నట్లు వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. చర్చలను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు బుధవారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు.. సంచలన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రోడ్ల అంశంపై ఈరోజు అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ సాగింది. మంత్రులు వర్సెస్ హరీష్ అన్న తరహాలో చర్చలు జరిగాయి. రోడ్ల అంశం రావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడటం ప్రారంభించారు. ఇందులో భాగంగానే హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. మామ చాటు అల్లుడుగా రూ.10వేల కోట్లు దోచుకున్న వ్యక్తి హరీష్ రావు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి తీరుపై ఘాటుగా స్పందించిన హరీష్ రావు.. ఇన్నాళ్లూ రోడ్లపై పెట్టిన విధంగా ఒకపై అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు చేసిన ఈ డిమాండ్‌లో సభలో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ నేతలంతా హరీష్ రావుపై మూకుమ్మడిగా విమర్శలు గుప్పించారు. సభా మర్యాదను మరికి హరీష్ రావు మాట్లాడుతున్నారని, ఆయన దృష్టిలో అసెంబ్లీకి అసలు మర్చాదే లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్‌కు పని చేయడం తెలీదు: కోమటిరెడ్డి
ఈ చర్చలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హరీష్ రావుపై విమర్శలు జల్లు కురిపించారు. ‘‘హరీష్ రావుకు దబాయించడం తప్ప పని చేయడం అస్సలు తెలీదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవట్లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమీషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. రూ.10వేల కోట్లు దోచుకున్నాడు. బీఆర్ఎస్ నేతలకు రోడ్లు వేయడం చేతకాదు. కూలిపోయే ప్రాజెక్ట్‌లు కట్టారు. రూ.లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను అమ్ముకున్నారు. ఏళ్లు పూర్తయినా ఉప్పల్ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం ఫామ్ హౌస్ వరకు నాలుగు లైన్ల రోడ్లు వేసుకున్నారు. వాచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రెడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. నాలుగేళ్లలో ఆర్ఆర్ఆర్‌ను పూర్తి చేస్తాం’’ అని అన్నారు. దీనిపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు.
రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్లుగానే..
— BRS TechCell (@BRSTechCell) December 18, 2024
అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి.
కొందరు పొద్దున్నే డ్రింక్ చేసి.. సభకు వస్తున్నారు.
- అసెంబ్లీలో ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/Gn7WCOODt8
సుద్దులు మాకే కాదు మీకూ వర్తిస్తాయి: హరీష్
కోమటిరెడ్డి ఆరోపణలపై హరీష్ రావు మండిపడ్డారు. సుద్దులు బీఆర్ఎస్ నేతలకే కాదని, సొంత పార్టీ నేతలకు కూడా చెప్పుకోవాలని కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబుకు చెప్పారు. ‘‘వ్యక్తిగతమైన విమర్శలు సభలో చేయకూడదని మంత్రి శ్రీధర్ బాబు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అది తమ మంత్రులకు కూడా వర్తిస్తాయి. సభలో తప్పుగా ఎవరు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా? కమీషన్ అంటూ మాట్లాడితే.. కోమటిరెడ్డి చిట్టా అంతా విప్పుతాను. కోమటిరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్లు నిరూపించాలని ఛాలెంజ్ చేస్తున్నా’’ అని ఛాలెంజ్ చేశారు. ఈ సందర్బంగానే ఇన్నాళ్లూ రోడ్డుపై పెట్టిన డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌ను అసెంబ్లీ బయట కూడా పెట్టాలని, కొందరు సభ్యులు పొద్దుపొద్దున్నే తప్పతాగి వచ్చి సోయలేకుండా మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు.
మండిపడ్డ కాంగ్రెస్ నేతలు..
హరీష్ రావు డిమాండ్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటలు తీవ్రంగా బాధిస్తున్నాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘‘హరీష్ రావు మాటలు సమాజం ఇబ్బంది పడేలా ఉన్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణలు చెప్పాలి’’ అని పొంగులేటి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విప్ బీర్ల ఐలయ్య కూమా ఘాటుగానే స్పందించారు. ‘‘హరీష్ రావుకు వాళ్ల మామ గుర్తుకొచ్చినట్లు ఉన్నాడు. అందుకే సభలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం పదవిని త్యాగంచేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడింది’’ అని విమర్శలు గుప్పించారు. కాగా అనంతరం హరీష్ రావు, బీర్ల ఐలయ్యల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.
ఇలాంటి డిమాండ్ నెవ్వర్ బిఫోర్..
అయితే బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన డిమాండ్ సంచలనంగా మారింది. అసెంబ్లీ సమావేశాల చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇటువంటి డిమాండ్ చేసింది. లేదు. అసలు డ్రంక్ డ్రైవ్ పెట్టాలన్న వాదన కూడా ఏనాడూ జరగలేదు. అటువంటిది ఈరోజున కొమటిరెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఈ డిమాండ్ చేయడం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఇదెంతవరకు సమంజసం అన్న చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకూడా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా ఉంది. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం సబబేనా? అసలు పెట్టొచ్చా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.