హజ్ యాత్ర: తెలంగాణకి చెందిన ఆరుగురు మృతి
x

హజ్ యాత్ర: తెలంగాణకి చెందిన ఆరుగురు మృతి

సౌదీ అరేబియాలో హీట్ వేవ్స్ కారణంగా ఈ సంవత్సరం హజ్ యాత్రలో మరణించిన 68 మంది భారతీయులలో తెలంగాణకు చెందిన ఆరుగురు యాత్రికులు ఉన్నారు.


సౌదీ అరేబియాలో హీట్ వేవ్స్ కారణంగా ఈ సంవత్సరం హజ్ యాత్రలో మరణించిన 68 మంది భారతీయులలో తెలంగాణకు చెందిన ఆరుగురు యాత్రికులు ఉన్నారు. 49 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న వీరంతా హైదరాబాద్‌ తోపాటు పొరుగు జిల్లాలకు చెందిన వారని తెలంగాణ హజ్‌ కమిటీ అధికారులు ధ్రువీకరించారు.

హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రహీం ఆసిఫ్‌ (55) గుండెపోటుతో జూన్‌ 18న జమారాత్‌లో మృతి చెందగా.. మరో ఇద్దరు యాత్రికులు సంగారెడ్డి జిల్లాకు చెందిన సూరయ్య యాస్మీన్‌ (49), అబ్దుల్ వహీద్‌ రైసా (50) జూన్‌ 16న మృతి చెందారు. కాగా, మదీనాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యాస్మీన్‌ మృతి చెందగా... రైసా మినాలో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. నిజామాబాద్ కి చెందిన ఫర్హాత్ అలీ మీర్ (61) కూడా గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

అంతకు ముందు, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు - మహ్మద్ తాజుద్దీన్ (69), ఇలియాస్ మహ్మద్ (61) వరుసగా జూన్ 14 మరియు జూన్ 11 న మక్కాలో మరణించారు. వారిద్దరికీ గుండెపోటు రావడంతో కుటుంబీకులు అక్కడే సమాధి చేశారని అధికారులు తెలిపారు.

కాగా, ఈ సంవత్సరం హజ్ యాత్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మక్కాకు వచ్చిన దాపు 600 మంది భక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 68 మంది భారతీయులు ఉన్నట్లు ధృవీకరించారు. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక, కొంతమంది ఆరోగ్యసమస్యలతోనూ మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.

Read More
Next Story