సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.. ఇంతకీ ఇది ఎవరి కల?
x

సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్.. ఇంతకీ ఇది ఎవరి కల?

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు నీటి కష్టాలు తీర్చే సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది.


ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు నీటి కష్టాలు తీర్చే సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ప్రాజెక్ట్ లోని మొదటి పంప్ నుంచి నీళ్లు విడిచి పెట్టడంతో గోదారి నీళ్లు ఎగసిపడుతూ పరవళ్లు తొక్కాయి. ఈ దృశ్యాలను చూసి అక్కడున్నవాSitarama project, KCR, KTR, Telangana Congress, Thummala Nageswara Raoరంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మంత్రి తుమ్మల భావోద్వేగంతో భూమికి ప్రణమిల్లారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాలలోని లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందనుంది.

20 ఏళ్ళ కిందటే శంకుస్థాపన...

ఉమ్మడి ఖమ్మంలోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తైంది. ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నేడు ట్రయల్ రన్ నిర్వహించింది. అయితే, 2004 కంటే ముందే దీనికి ప్రతిపాదనలు సిద్ధమైనా ప్రాజెక్ట్ పనులు రూపుదాల్చలేదు. 2016 ఫిబ్రవరి 16న కేసీఆర్ సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పనులు పూర్తి అయ్యాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రాజెక్ట్ క్రెడిట్స్ మావంటే మావని చెప్పుకునే పనిలో పడ్డారు. ట్విట్టర్ వేదికగా పోటాపోటీగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. కేసీఆర్ కల సీతారామ ప్రాజెక్టు పూర్తయిందని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే... మీరు అవినీతితో ఆగమాగం చేయబట్టే 2014 లో ప్రారంభం కావాల్సినప్రాజెక్ట్ లేట్ అయిందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.

నెరవేరిన కేసీఆర్ కల.. -బీఆర్ఎస్

"నెరవేరిన తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ గారి కల.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమవుతున్న తరుణం.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. గంగమ్మ జల సవ్వడులతో తడిచిన ఖమ్మం నేల. ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు అందనున్న సాగు నీరు" అంటూ బీఆర్ఎస్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. ఇక ఇదే పోస్టుని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. "నీటిపారుదల రంగంలో కేసీఆర్‌ టీమ్‌ చేసిన అద్భుత కృషికి మరో ఉదాహరణ" అన్నారు. వీటికి కాంగ్రెస్ కూడా తమ అధికారిక ఖాతాలో కౌంటర్ ఇచ్చింది.

కాంగ్రెస్ వస్తే రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే...

"కల్వకుంట్ల డ్రామారావా! 2014 లోనే రూ. 3000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మీ కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో రూ.18,500 కోట్లకు పెంచి పదేండ్లు ఆలస్యం చేస్తిరి. ప్రాజెక్టుకు అవసరం అయిన అనుమతుల్లో, భూ సేకరణలో, బాధితులకు పునరావాసం అందించడంలో నిర్లక్ష్యం చేసి, మీరు మాత్రం అందినకాడికి దోచుకుంటిరి. ప్రజా ప్రభుత్వం వచ్చాక, జనవరి 7, 2024 నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రాజెక్టు పురోగతిపై రివ్యూ నిర్వహించి, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టారు. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ గోదావరి జల కళ. మీకు తెల్సిందల్లా అవినీతితో.. ఆగమాగం ప్రాజెక్టులు కట్టి, పడగొట్టడం, పంపుహౌజులను కట్టి, వరదతో ముంచెత్తడం, మంచి చేసే వారిపై దుష్ప్రచారాలతో బురద జల్లడం. ఇప్పడు చెప్పు.. కాంగ్రెస్ వస్తే ఏమొచ్చే! ఎగిసిపడే గోదావరమ్మ జల కల వచ్చే! తెలంగాణ రైతన్నల జీవితాల్లో వెలుగొచ్చే!" అంటూ కేటీఆర్ కి, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

Read More
Next Story