
మహిళ కమిషన్‌కు కల్పన ఫిర్యాదు
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్లు అన్నీ కూడా తన వీడియోలు, ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె ఫిర్యాదు చేశారు.
‘ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఓవర్ డోజ్‌లో నిద్రమాత్రలు మింగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆమె ఫ్లాట్ తలుపులు మూసేసే ఉండటంతో పోలీసుల సహాయాంతో ఆమెను ఫ్లాట్ తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అపస్మాకర స్థితిలో ఉన్న కల్పనను హుటాముటిన ఆసుపత్రికి తరలించారు. పెద్దకూతురు, భర్తతో ఉన్న మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు’ గత కొన్ని రోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్తలివి. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన నిద్రమాత్రలు ఓవర్ డోస్ వేసుకోవడంతో స్పృహ కోల్పోయానని కల్పన, ఆమె కూతురు కూడా చెప్పారు. కానీ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందని, అందుకు కారణం ఏంటంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కల్పన.. ఈ వార్తలపై సీరియస్ అయ్యారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని అన్నారు. అయినా ఇవి ఆగకపోవడంతో శనివారం తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్లు అన్నీ కూడా తన వీడియోలు, ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిన్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. మహిళలపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టేవారిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఎవరినీ విడిచిపెట్టమని చెప్పారు.