
కోర్టులోనే తుదిశ్వాస విడిచిన సీనియర్ న్యాయవాది
సీనియర్ న్యాయవాది ఒకరు వాదనలు వినిపిస్తూనే గుండెపోటు రావడంతో కుప్పకూలి తుదిశ్వాస విడిచారు.
భారత్‌ను గుండెపోటు కబళిస్తోంది. చిన్నపెద్ద అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరికీ గుండె పోటు ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో స్కూళ్లో ఆడుకుంటూ, ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు చేస్తూ, జిమ్ చేస్తూ, స్కూళ్లో పాఠాలు వింటూ ఇలా మరెన్నో సందర్భాల్లో గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఈ మధ్య అనేకం చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతి ఒక్కరిలో గెండెపోటు భయం పెరిగిపోతోంది. తాజాగా ఇటువంటి ఘటన తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. సీనియర్ న్యాయవాది ఒకరు వాదనలు వినిపిస్తూనే గుండెపోటు రావడంతో కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఉన్నతన్యాయస్థానంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సహచర న్యాయవాదులు, న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పసునూరి వేణుగోపాల్ రావు అనే సీనియర్ న్యాయవాది ఎప్పటిలానే న్యాయస్థానికి చేరుకున్నారు. తన క్లయింట్ తరుపున కోర్టులో సీరియస్‌గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టడం ప్రారంభమయ్యాయి. అర్థం చేసుకునేలోపే గుండెపోటు వచ్చి నిల్చున్న చోటే కుప్పకూలారు. వెంటనే తోటి న్యాయవాదులు వచ్చి ఆసుపత్రికి తరలించే సరికి ఆయన తుదిశ్వాస విడిచారు.