హైదరాబాద్ లో కొత్త తరహా దొంగలు... కత్తితో గాయం చేసి దోపిడీ
x

హైదరాబాద్ లో కొత్త తరహా దొంగలు... కత్తితో గాయం చేసి దోపిడీ

పట్టపగలే ఓ బంగారు దుకాణంలోకి బురఖా ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో గాయం చేసి మరీ దోపిడీకి పాల్పడిన తీరు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది.


హైదరాబాద్ పరిధిలోని కొంపల్లిలో గురువారం తెల్లవారుజామున జరిగిన దొంగతనం కేసు స్థానికంగా కలకలం రేపింది. పట్టపగలే ఓ బంగారు దుకాణంలోకి బురఖా ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో గాయం చేసి మరీ దోపిడీకి పాల్పడిన తీరు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. మెడపై కత్తితో దాడి చేసినప్పటికీ దుకాణం యజమాని చాకచక్యంగా వారిని తిప్పికొట్టడంతో దొంగల ప్లాన్ విఫలమైంది. ప్రస్తుతం ఘటనకి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ రోడ్డులో ఉన్న శ్రీ జగదాంబ జువెలర్స్ దుకాణంలోకి బురఖా ధరించిన ఇద్దరు దొంగలు కస్టమర్లలా వచ్చారు. వచ్చిన వెంటనే ఒక దొంగ షాపు యజమాని మెడపై కత్తితో గాయం చేశాడు. చంపేస్తామని బెదిరిస్తూ యజమానిని నగలన్నీ తాము తెచ్చిన బ్యాగ్ లో పెట్టమని బెదిరించారు. అయితే, నిందితులు ఆభరణాలపై చేయి వేయకముందే, యజమాని టేబుల్ మీద నుండి దూకి సహాయం కోసం కేకలు వేస్తూ దుకాణం నుండి బయటకు వచ్చాడు.

వారి పథకం విఫలమవడంతో నిందితులు షాపు నుంచి బయటకు వచ్చి మోటార్‌ సైకిల్‌పై పరారయ్యారు. వారు తప్పించుకునే సమయంలో షాపులో ఉండే షాప్ కీపర్ నేరస్థుడిపై కుర్చీ విసిరాడు. కానీ, అప్పటికే ఇద్దరూ బండిపై పారిపోయారు. గాయాలపాలైన యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌తో ఘటనాస్థలిని సందర్శించి కొన్ని ఆధారాలను సేకరించారు. రోడ్డుపై అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో రికార్డయిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, దొంగలు కొన్ని నగలు ఎత్తుకెళ్లినట్టు షాప్ కీపర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగిలించబడిన వస్తువుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More
Next Story