శభాష్ అనిపించిన రైతు కొడుకు.. ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు..
x

శభాష్ అనిపించిన రైతు కొడుకు.. ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు..

కష్టపడి ప్రయత్నిస్తే ఏదైనా మన చెంతకు చేరక తప్పదని పెద్దలు అంటుంటారు. దానిని మంచిర్యాలకు చెందిన నస్పూరి సంతోష్ అనే యువకుడు అక్షర సత్యమని నిరూపించాడు.


కష్టపడి ప్రయత్నిస్తే ఏదైనా మన చెంతకు చేరక తప్పదని పెద్దలు అంటుంటారు. దానిని మంచిర్యాలకు చెందిన నస్పూరి సంతోష్ అనే యువకుడు అక్షర సత్యమని నిరూపించాడు. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగ సాధన కష్టం కాదని, కాపోతే దాని కోసం ప్రిపేర్ అవడం ఇష్టంగా చేయాలని చెప్తున్నాడు. సంతోష్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన సంతోష్.. ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన రైతు నస్పూరి లచ్చన్న, రాజవ్వ దంపతులు కుమారుడు సంతోష్.

సంతోష్ పదో తరగతి వరకు తపాల పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీలను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో బీఈడీ ముగించుకుని అప్పటి నుంచి ఉద్యోగాల వేటలో పడ్డాడు. తొలిసారి 2023లో రైల్వేలో పడిన ఉద్యోగాల ప్రకటనకు పోటీ పడ్డాడు. అందులో పాయింట్‌మ్యాన్‌గా ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగం చేస్తూనే సంతోష్.. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కు పరీక్ష రాణి ఉత్తీర్ణుడయ్యారు. ఆ ఉద్యోగం కూడా రావడంతో రైల్వేస్ ఉద్యోగానికి రాజీనామా చేసి సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. ఆ ఉద్యోగం చేస్తూ 2024లో గురుకుల ఉద్యోగాలకు వచ్చి నోటిఫికేషన్‌కు అప్లై చేసి పరీక్ష రాశారు. ఏకంగా టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలను హస్తగతం చేసుకున్నాడు. వాటిలో చేరని సంతోష్.. ఇటీవల పడిన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ పరీక్ష రాశారు. అక్టోబర్ 27న వీటి ఫలితాలు రాగా.. వాటిలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నారు సంతోష్.

వారి వల్లే ఇది సాధ్యమైంది: సంతోష్

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఓటమెరుగని వీరుడి తరహాలో దూసుకెళ్తున్న సంతోష్ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. తన చదువు కోసం తన తల్లిదండ్రులు ఎంతో శ్రమించారని, వారి ఆశీర్వాదం వల్లే తనకు ఈ విజయాలు చేరువయ్యాయని అంటున్నారు. వారి ఆశీస్సులు లేకుంటే తాను ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కాదని, వారి వల్లే జీవితంలో ఇంత అభివృద్ధి సాధ్యమైందని అంటున్నారు. ఒక తన ఉద్యోగం విషయానికి వస్తే తాను సింగరేణి‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి మారతానని వివరించారు.

Read More
Next Story