Sankranthi Sandadi | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, భోగి మంటలు
x

Sankranthi Sandadi | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, భోగి మంటలు

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంక్రాంతి సందడితో కళకళ లాడాయి. సోమవారం తెల్లవారుజామునే బోగిమంటలు వేసుకొని యువతీ,యువకులు నృత్యం చేస్తూ కేరింతలు కొట్టారు.


తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సోమవారం సంక్రాంతి సందడితో కళకళ లాడాయి. సోమవారం తెల్లవారుజామునే బోగిమంటలు వేసుకొని యువతీ,యువకులు నృత్యం చేస్తూ కేరింతలు కొట్టారు. వీధుల్లో మహిళలు అందాల రంగవల్లులతో ముస్తాబు చేశారు.

- రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో రెండు రాష్ట్రాల వీధులు కోలాహలంగా కనిపించాయి.హరిదాసులు బసవన్నలతో వీధుల్లో కలియ తిరిగారు. నగరాల నుంచి సంక్రాంతి పండుగకు జనం పల్లెలకు తరలిరావడంతో గ్రామాలు సంక్రాంతి శోభతో కళకళలాడాయి.



- ముగ్గుల పోటీలు, క్రీడల పోటీలు, కోడిపందాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి ఏర్పడింది. అరిసెలు, గారెలు, చక్కినాలు, పాయసం ఇలా ఎన్నెన్నో రకాల వంటకాలు నోరూరించాయి. కొత్త బట్టలు ధరించి తెలుగు ప్రజలు సంతోషాలతో పండుగను జరుపుకుంటున్నారు. నగరాల్లోని జనం పల్లెబాట పట్టడంతో నగరాలు వెలవెలబోగా, పల్లెలు నగరాల నుంచి వచ్చిన ప్రజలతో సందడిగా కనిపించాయి.




తెలుగు ప్రజలు కొత్త బట్టలు ధరించి సోమవారం ఆలయాలకు తరలివచ్చారు. భోగి పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ లో కైట్ ఫెస్టివల్ సందడి కనిపించింది. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలు సోమవారం ఉదయం చార్మినార్ ను సందర్శించారు.


Read More
Next Story