సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన తొలి గిరిజనుడు కార్తీక్‌కు ప్రశంశలు
నాయక్ నిజామాబాద్ జిల్లా జక్రన్‌పల్లి మండలంలోని వివేక్ నగర్ గిరిజన తండాకు చెందిన యువకుడు. చిన్న కథల సంకలనం ‘ధవ్‌లో’కు గానూ అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు.
కేంద్రసాహిత్య అకాడమీ నుంచి యువ పురస్కారానికి ఎంపికైన తొలి గిరిజనుడు రమేష్ కార్తీక్ నాయక్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాయక్ నిజామాబాద్ జిల్లా జక్రన్‌పల్లి మండలంలోని వివేక్ నగర్ గిరిజన తండాకు చెందిన యువకుడు. అతను రాసిన చిన్న కథల సంకలనం ‘ధవ్‌లో’కు గానూ అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సంకలనంలో ఇతను 400కు పైగా బంజారా భాష పదాలను పాఠకులకు పరిచయం చేశారు.
నాయక్ ఇప్పటివరకు నాలుగు పుస్తకాలు రాశారు. వాటిలో మూడు తెలుగు కాగా ఒకటి ఇంగ్లీష్‌లో ఉంది. అతను తన రచనల్లో ఎక్కువగా తన లంబాడీ వర్గ జీవనశైలిని ప్రతిబింబిస్తారు. ఈ రచనలు పలు అంతర్జాతీయ మ్యాగజైన్‌లలో ప్రచురితమయ్యాయి, అనేక భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి.
నాయక్ తొలి కవితా సంకలనం ‘చక్‌మక్’ గత సంవత్సరం బెంగళూరు కవితా సమారోహంలో విడుదలయింది. ఇది కాకుండా ఇతనివి ‘బల్దేర్ బండి’, ‘కేసుల’ అనే పుస్తకాలు కూడ విడుదలయ్యా’యి. ఇతని అసలు పేరు నున్నావత్ కార్తీక్, కలంపేరు రమేష్ కార్తీక్ నాయక్. 2014లో రచనలు ప్రారంభించాడు. ఇతని బల్దేర్ బండి ఇప్పుడు ఆంధ్రా విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ పుస్తకాలలో సిలబస్ గా ఉంది.
కార్తీక్ తల్లి సెవంత కూరగాయలు అమ్ముతుంది, తండ్రి వ్యవసాయదారుడు. ప్రస్తుతం నాయక్ ‘తిత్రి’ అనే సంకలనాన్ని వెలువరించే ప్రయత్నంలో ఉన్నారు.
నాయక్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు.