రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5వేల కోట్లు.. డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్..
x

రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5వేల కోట్లు.. డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్..

తెలంగాణలోని రెసిడెన్షల్ స్కూల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ఈ స్కూళ్లను నెవ్వర్ బిఫోర్ అనేలా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు.


తెలంగాణలోని రెసిడెన్షల్ స్కూల్స్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. ఈ స్కూళ్లను నెవ్వర్ బిఫోర్ అనేలా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెసిడెన్షయల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేస్తామని, అన్ని వసతులతో విద్యార్థులకు ది బెస్ట్ విద్యను అందిస్తామని వెల్లడించారు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్‌ను అభివృద్ధి చేస్తామని, వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దుతామని ఆయన వివరించారు. ఆ దిశగానే అడుగులు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని ఆయన చెప్పారు. ఆ లక్ష్య సాధనకైన ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెప్పుకొచ్చారు.

ఒక్క స్కూల్‌కి సరైన భవనం లేదు..

‘‘రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ఒక్క స్కూల్‌కు కూడా సరైన భవనం లేదు. వాటి రాతను మార్చడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. రెసిడెన్షయల్ స్కూల్స్ కోసం అవి ఉన్న నియోజకవర్గాల్లోనే 25 ఎకరాల స్థలం కేటాయించాం. అంతేకాకుండా రెసిడెన్షయల్ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.5 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాం. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్నదే మా ప్రభుత్వ తాపత్రయం. ఈ పాఠశాలలకు అన్ని నియోజకవర్గాల్లో త్వరిత గతిన స్థలం సేకరించి ఈ విద్యా సంవత్సరంలోనే 22 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.

పైలట్ ప్రాజెక్ట్‌గా యంగ్ ఇండియా

తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేరపట్టనున్నట్లు కూడా మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటి వరకు తమకు 20-25 స్కూళ్లకు సంబంధించిన డేటాను కలెక్టర్లు అందించారని, వాటి పనులనే పైలట్ ప్రాజెక్ట్‌లో యుద్ధప్రాతిపదిక చేపట్టనున్నామని కూడా ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించి ఎన్నికల సమయంలోనే ప్రజలకు హామీ ఇచ్చామని, దాని ప్రకారమే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామని వివరించారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోనే రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తామని, వీటిని అభివృద్ధి చేసి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేలా చూస్తామని ఆయన చెప్పారు.

ప్రతి విద్యార్థికి ఇదే మా భరోసా..

రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, సీనియర్ అధికారులతో రూపొందే ఈ కమిటీ 3 నెలలు కష్టపడి నివేదికను రూపొందించి ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నామని ఆయన వివరించారు. చాలా మంది విద్యార్థులు తమ సమస్యలను మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారని, వారందరికీ తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను తప్పకుండా తెలురుస్తామని, అందులో కేవలం విద్యే కాకుండా క్రీడలకూ ప్రాధాన్యత అందిస్తామని ఆయన వివరించారు. ఈ స్కూల్స్‌లో అన్ని వర్గాల వారికి విద్యా అందిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్య ఉంటుందని చెప్పారు. తనకు అవకాశం దక్కలేదని ఏ ఒక్క విద్యార్థికి భావన కలుగకుండా చూసుకుంటామని, అవసరం అనుకుంటే సినిమాలను సైతం ప్రొజెక్ట్ చేసి.. విద్యార్థులకు అన్నీ అందేలా చూస్తామని కూడా చెప్పారాయ. దసరా కన్నా ముందే రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన వివరించారు.

Read More
Next Story