HCU రోహిత్ వేముల దళితుడు కాదు.. కేసు క్లోజ్...
x

HCU రోహిత్ వేముల దళితుడు కాదు.. కేసు క్లోజ్...

రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో అతి పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో అతి పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసులో వీసీ అప్పారావుకి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే కేసును క్లోజ్ చేస్తున్నట్టు తెలంగాణ హై కోర్టుకి తెలిపారు.

2016 లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రాజకీయం దుమారం చెలరేగింది. రోహిత్ ఆత్మహత్యపై గతంలో 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు సైతం చేర్చారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు ఆత్మహత్యకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.

అసలు రోహిత్ దళితుడు కాదని, కులం విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని వెల్లడించారు. దీంతో పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని రోహిత్ కుటుంబానికి న్యాయస్థానం సూచించింది.

పోలీసుల ప్రకనటతో ఈ కేసులో నిందితులుగా ఉన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఉపశమనం లభించింది.

Read More
Next Story