Road Accidents | మైనర్ల డ్రైవింగ్‌తో పెరిగిన రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్‌లో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ మైనర్ల డ్రైవింగును నిలిపివేయండి అని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్ నగరం ఢిల్లీని మంచేసింది. హైదరాబాద్ నగరంలో అత్యథిక కారు ప్రమాదాలు జరిగాయని వాహన బీమా సంస్థ తాజాగా వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో నిలిచింది.
- మైనర్లు వాహనాలను అతి వేగంగా, నిర్లక్ష్యంగా , ట్రాఫిక్ నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.కారు చెరువులో మునిగిపోవడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు.
- మైనర్ల డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం మైనర్లు వాహనాలు నడపకండి (Stop Minors Driving) Road Accidentsఅంటూ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఎంపీ పెట్టిన పోస్టుపై నెటిజన్లు పలువురు స్పందించారు.
- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బండ్లగూడ సౌత్ జోన్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు,మరణాలను నివారించడానికి మైనర్‌లను కార్లు, ద్విచక్ర వాహనాలు నడపకుండా ఆపండి అని ఎంపీ పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాలు
దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 10వేల మంది మరణిస్తుండగా, మరో 40వేల మంది గాయాలతో బాధ పడుతున్నారు. మైనర్లు డ్రైవింగ్ లైసెన్సు లేకుండానే హైదరాబాద్ నగరంలో రాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో పలు రోడ్డు ప్రమాదాలు వాటిల్లుతున్నాయి.
మైనర్లు వాహనాలు నడపకుండా చర్యలు
హైదరాబాద్ నగరంలో మైనర్లు కార్లు, ద్విచక్రవాహనాలు నడపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.ఈ నేపథ్యంలో సిటీ పోలీసులు నగరంలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి మైనర్లు అయిన విద్యార్థులు వాహనాల నడపకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలకు కార్లు, ద్విచక్రవాహనాలను డ్రైవింగ్ చేసుకుంటూ విద్యార్థులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మైనర్ల డ్రైవింగ్ వల్ల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో మైనర్ల డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని తాజాగా వెల్లడైంది. మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 199 (ఎ) ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించారు. మణికొండలో గోల్డెన్ టెంపుల్ వద్ద జూన్ నెలలో 16 ఏళ్ల బాలుడు కారు నడుపుతూ పార్కింగ్ చేసిన పలు ద్విచక్రవాహనాలపైకి పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో పలు ద్విచక్రవాహనాలు దెబ్బతినడంతోపాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడితే వారి తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులపై చర్యలు తీసుకుంటారు. రోడ్డు ప్రమాదాలకు మైనర్లు పాల్పడితే వారికి 25 ఏళ్ల వయసు వచ్చే వరకూ లెర్నింగ్ లైసెన్సు లేదా డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వకుండా రవాణ శాఖ చర్యలు తీసుకుంది.
మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు
18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు నడిపేందుకు అనుమతించే తల్లిదండ్రులపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమైతే అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తారు. దీంతోపాటు మైనర్లు వాహనం నడిపినందుకు రూ.12వేల జరిమానా విధించాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్లు వాహనం నడిపితే వారి తల్లిదండ్రులపై కేసు పెట్టి వారిని జైలుకు పంపించాలని తెలంగాణ రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ నిర్ణయించింది.
లైసెన్స్ లేకుండా పిల్లలు డ్రైవ్ చేస్తే తల్లిదండ్రులకు జరిమానా
ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలతో పాటు పెనాల్టీ పాయింట్ల వంటి కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు.లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ పార్కింగ్, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ ప్రస్తుతం మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో డైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో వాహన యజమానులపై ట్రాఫిక్ అధికారులు దృష్టి సారించారు. మైనర్‌లకు లేదా లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలను ఇస్తే, పిల్లలను డ్రైవింగ్ చేయడానికి అనుమతించినందుకు యజమానులపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.
బైక్ రేసుల్లో పాల్గొంటే...
తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బైక్ రేసుల్లో పాల్గొనేందుకు వారి తల్లిదండ్రుల వాహనాలు లేదా బంధువుల వాహనాలను ఉపయోగిస్తున్నారు.మైనర్ డ్రైవింగ్ ను నియంత్రించడానికి పిల్లలు, తల్లిదండ్రుల కోసం కౌన్సెలింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు.మైనర్‌లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు జువైనల్ జస్టిస్ యాక్ట్-2015 ప్రకారం శిక్షార్హులు. అబిడ్స్, కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్లు, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల యజమానులు తమ వాహనాలను లైసెన్స్ లేకుండా ఇతరులకు ఇస్తున్నారు.
సిరిసిల్లలో స్పెషల్ డ్రైవ్
మైనర్లు బైక్ లు నడపకుండా సిరిసిల్ల పోలీసులు తాజాగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మైనర్లు వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమానిని జైలుకు పంపిస్తామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు.సిరిసిల్ల జిల్లాలో 285 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికారు. వారికి పోలీసులు చలాన్లు విధించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
Next Story