
రేవంత్ రెడ్డి చేతల్లో చూపించారు, సీఎం స్టాలిన్ ప్రశంస
పునర్విభజనపై తెలంగాణ శాసనసభలో మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి రేవంత్ రెడ్డి తన మాటలను చేతల్లో నిరూపించారని సీఎం ఎంకే స్టాలిన్ కొనియాడారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ శాసనసభలో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను చేతల్లో నిరూపించారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొనియాడారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణ శాసనసభ గురువారం తీర్మానం చేసిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
As resolved in Chennai, fulfilled in Hyderabad!
— M.K.Stalin (@mkstalin) March 27, 2025
Hon'ble Telangana CM Thiru. @revanth_anumula garu has walked the talk by tabling and passing a landmark resolution in the #Telangana State Assembly demanding #FairDelimitation that upholds justice, equity and the federal spirit.… https://t.co/gt5knIBeZv
తమిళనాడు సీఎం ట్వీట్
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు జరపకుండా చేస్తున్న కసరత్తు పట్ల తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్‌సభ సీట్ల… pic.twitter.com/bo6YOQ3ivh
— Telangana CMO (@TelanganaCMO) March 27, 2025
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్