Manchu family |మోహన్ బాబు, విష్ణు తుపాకీ లైసెన్సుల సీజ్‌కు సిఫార్సు
మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజుకున్న ఘర్షణ రోజుకో మలుపు తిరుగుతుంది. రాచకొండ పోలీసులు మోహన్ బాబు, విష్ణుల గన్ లైసెన్సుల రద్దుకు రాచకొండ పోలీసులు సిఫార్సు చేశారు.
మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజుకున్న ఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వార్తల కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ నుంచి మోహన్‌బాబు, విష్ణులు గన్ లైసెన్స్‌లు పొందారు. తాజా ఘర్షణల దృష్ట్యా సీరియస్ అయిన పోలీసులు ఇద్దరి తుపాకుల లైసెన్స్‌లను స్వాధీనం చేసుకోవాలని రాచకొండ పోలీస ఉన్నతాధికారులు ఆదేశించారు.
జల్ పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్ గేటును మనోజ్, అతని బౌన్సర్లు తోసుకొని లోపలకు వెళ్లారు. మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులు లోపలకు రాగా వారిపై మోహన్ బాబు దాడి చేశారు. ఓ టీవీ చానల్ విలేఖరి చేతిలోని మైక్ లాక్కొని కొట్టారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. మోహన్ బాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది
మీడియాపై దాడిని ఖండించిన హెచ్ యూజే
మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే ) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మీడియా వారధిగా ఉంటుందని, సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో పనిచేస్తారని హెచ్ యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ చెప్పారు. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్ యూజే డిమాండ్ చేసింది. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని కోరుతున్నట్లు హెచ్ యూజే డిమాండ్ చేసింది.
Next Story