హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి దెబ్బ
x
హైదరాబాద్ రియల్ ఎస్టేట్

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి దెబ్బ

హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది.2025వ సంవత్సరం మొదటి మూడుమాసాల్లో అమ్ముడుపోని నివాసగృహాల సంఖ్య గత ఏడాది కంటే పెరిగాయని అనరాక్ నివేదిక వెల్లడించింది.


హైదరాబాద్ నగరంలో పలు కారణాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. పలు రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా, ఆయా ఇళ్ల విక్రయాలు మాత్రం సాగటం లేదు. 2024వసంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో 1660 గృహాల విక్రయానికి సిద్ధంగా ఉన్నా, అమ్ముడు పోలేదని అనరాక్ (ANAROCK ) నివేదిక తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది. 2025వ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 1815 గృహాలు అమ్ముడు పోలేదని అనరాక్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా అమ్ముడు పోని గృహాలు 19 శాతం తగ్గాయి.


హైడ్రా ఎఫెక్ట్
దేశంలోని నేషనల్ కేపిటల్ రీజియన్, బెంగళూరు, పూణే, చెన్నై, కోల్ కతా నగరాల్లో గత ఏడాది కంటే తక్కువ గృహాలు అమ్ముడు పోలేదని అన్ రాక్ నివేదిక తెలిపింది. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రం ఇతర నగరాల కంటే ఎక్కువ గృహాలు విక్రయానికి నోచుకోలేదు. అంటే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని వినూత్న రియల్ ఎస్టేట్ గ్రూపు అధిపతి మాటూరి సురేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైడ్రా ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ నగరంలో ఇళ్ల విక్రయాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

టాప్ ఏడు నగరాల్లో...
దేశంలోని టాప్ ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గిపోవడంతో కొత్త రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టలేదని అన్ రాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి చెప్పారు.హైదరాబాద్ నగరంలో అమ్ముడు పోని ఇళ్ల సంఖ్యలో గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల కనిపించింది. ఇతర నగరాల్లో పోలీస్తే హైదరాబాద్ నగరంలో ఇళ్లకు డిమాండ్ తగ్గింది. ప్రస్థుతం నగరంలో 1815 ఇళ్ల విక్రయాలు కాలేదు. హైడ్రా ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్‌లో అమ్ముడుపోని రెసిడెన్షియల్ ప్రాపర్టీ స్టాక్స్ భారీగా పెరిగాయి.

గతంలో హాట్ కేకుల్లా...
గతంలో హాట్ కేకుల్లా రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాలు జరగ్గా. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టరులో తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.సరసమైన గృహాల విక్రయాల వాటా2024 కంటే 9 శాతానికి పడిపోయింది. లగ్జరీ గృహాల విక్రయాల్లో 6 శాతం పెరుగుదల కనిపించింది.టాప్ ఏడు భారతీయ నగరాల్లో 2025 మొదటి త్రైమాసికం చివరి నాటికి 1,12,744 ఇళ్లు అమ్ముడుపోనివి ఇళ్లు ఉన్నాయి.

రియల్ రంగాన్ని ప్రోత్సహించండి : నరెడ్కో
అఫోర్డబుల్ హౌసింగ్ రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతం తగ్గించాలని, హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాలని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సెల్ అధ్యక్షుడు జి హరిబాబు డిమాండ్ చేశారు.

హైడ్రాతో రియల్ రంగం పడిపోలేదు : ఏవీ రంగనాథ్
హైదరాబాద్ నగరంలో హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పడిపోలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. మార్కెట్ లో స్తబ్దత ఏర్పడిందని, దీనికి హైడ్రా బాధ్యత వహించదని చెప్పారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ప్రజలు మోపపోకుండా నివారించేందుకు హైడ్రా ఏర్పడిందని చెప్పారు.


Read More
Next Story