Fact Check : హీరో రవితేజకు తీవ్ర గాయాలు, నిజమెంత?
x

Fact Check : హీరో రవితేజకు తీవ్ర గాయాలు, నిజమెంత?

హీరో రవితేజకు షూటింగ్ లో తీవ్ర గాయాలపాలయ్యారు. భాను దర్శకత్వంలో వస్తోన్న RT 75 సినిమా షూటింగ్ జరుగుతోంది.


హీరో రవితేజకు షూటింగ్ లో తీవ్ర గాయాలపాలయ్యారు. భాను దర్శకత్వంలో వస్తోన్న RT 75 సినిమా షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ శివారు అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ రవితేజ కుడిచేతికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన్ని యశోదా ఆసుపత్రికి తరలించారు.


కుడి చేతి నరాలు చిట్లడంతో యశోద హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరుగుతున్నప్పుడు ఫోటో వైరల్ అవడంతో ఆందోళన నెలకొంది. నోటినిండా ఆక్సిజన్ ట్యూబులు, గుండెల మీద ఈసీజీ వైర్లు, కుడిచేతికి రక్తంతో ఆసుపత్రి బెడ్ మీద రవితేజను చూసి అభిమానులు కలత చెందుతున్నారు. రవితేజకు ఎలాంటి ఇబ్బంది లేదని కేవలం ఆపరేషన్ మాత్రమే జరిగిందని, ఆందోళన చెందవద్దని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గాయం నుండి కోలుకోవడాని ఆరు వారాలు పడుతుందని డాక్టర్లు తెలిపారు. చేతిపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన విశ్రాంతి అవసరమని రవితేజకి యశోద హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

ఫోటోలో నిజమెంత..?

రవితేజకి షూటింగ్ సమయంలో గాయమైన మాట వాస్తవమే కానీ, ఫోటో చూసి కంగారు పడాల్సిన పని లేదని ఆయన అభిమానులు తెలిపారు. అది షూటింగ్ సీన్ కి సంబంధించిన ఫోటో అని స్పష్టం చేశారు. షూటింగ్ లో గాయం అయినప్పటికీ ఆయన సీన్ కంప్లిట్ చేశారని తెలిపారు. అనంతరం హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారని వెల్లడించారు. కుడి చేతికి సర్జరీ అయిందని తెలిపారు.

Read More
Next Story