విద్యావ్యవస్థలో సమూల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
x

విద్యావ్యవస్థలో సమూల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

తెలంగాణ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.యువత ఉన్నత చదువులు చదువుకొని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు.


గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తున్నామని సీఎం పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం పేర్కొన్నారు.‘‘ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం.ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం.త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం’’అని సీఎం చెప్పారు.


విద్యార్థులను బడిలో చేర్పించాలి

యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలని సీఎం కోరారు.స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించాలని, ఇది యువతరంపై ఉన్న అతి పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరం.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దు అని సీఎం హితవు పలికారు.విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దంకండి...రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు అని సీఎం కోరారు.సామాజిక స్పృహతో సమాజానికి సేవచేసే వారు సమాజంలో హీరోలు అవుతారు..పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

కుల గణనపై సంప్రదింపుల సమావేశం
బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కుల గణన,కుటుంబ సర్వే పై జరగనున్న సంప్రదింపుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బేగంపేట విమాన శ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గాన బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కు చేరుకుంటారు.సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు ఐడియాలజీ సెంటర్ లో మేధావులతో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. ఈ సమావేశం లో కుల సంఘాల, విద్యార్థి సంఘాల,నాయకులు,మేధావులు,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, ఎంపీ గా పోటీ చేసిన అభ్యర్థులు,ఎంపీ లు, రాజ్యసభ సభ్యులు, సలహాదారులు,కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొంటారు.


Read More
Next Story