Rachakonda | దోషులకు శిక్షలు విధించడంలో రాచకొండ ఫస్ట్
x

Rachakonda | దోషులకు శిక్షలు విధించడంలో రాచకొండ ఫస్ట్

రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పోలీసుపెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్,బ్లూకోట్స్ వల్ల నేరాలను అదుపు చేయగలిగామని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.


రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2024 వ సంవత్సరంలో 33,084 కేసులు నమోదు చేయగా, వీటిలో 25,143 కేసులను పరిష్కరించామని పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు సోమవారం వెల్లడించారు. తెలంగాణలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన పోలీసు కమిషనరేట్ గా రాచకొండ రికార్డు సాధించింది. రాచకొండ పరిధిలో ఈ ఏడాది 30 మంది దోషులకు జీవిత ఖైదు పడింది.కోర్టుల ద్వారా జైలు శిక్షలు విధించడంలో రాచకొండ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.8 కేసుల్లో 14 మందికి జైలు శిక్షలు పడ్డాయి. కోర్టుల ద్వారా దోషులకు శిక్షలు విధించడంలో రాచకొండ అగ్రస్థానంలో నిలిచింది.సగటున రోజుకు రెండు శిక్షలు విధించినట్లు ఉంది.


విజిబుల్ సైకిల్ పెట్రోలింగ్
రాచకొండ పోలీసు కమిషనరేట్ లో మహిళా పోలీసు అధికారుల చొరవతో విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ ఇంటరాక్షన్, సైకిల్ పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వల్ల డయల్ 100కు వచ్చిన 2,41,742 కాల్స్ కు స్పందించి కాల్ వచ్చిన 8.37 నిమిషాల్లోనే సంఘటన స్థలాలకు వెళ్లగలిగామని సీపీ సుధీర్ బాబు చెప్పారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు
రాచకొండ పరిధిలో 5122 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు జాతీయ రహదారులు, 61 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్, గ్రామీణ, సబర్బన్ ప్రజల రాకపోకలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల మరణాలకు దారితీసే అవకాశముంది.రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో రాచకొండ పోలీసులు సక్సెస్ అయ్యారు.

ఇదీ నేరాల చిట్టా
2024వ సంవత్సరంలో 73 హత్యలు, 463 కిడ్నాప్ లు, 384 అత్యాచారం ఘటనలు నమోదయ్యాయి. డ్రగ్స్ కేసుల్లో 521 మందిని అరెస్టు చేశామని సీపీ సుధీర్ బాబు చెప్పారు. రూ.88.25 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల వల్ల మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించామని సీపీ చెప్పారు.పోక్సో కేసుల సంఖ్య 10 శాతం తగ్గిందని సీపీ వివరించారు. ప్రతీ రెండు నిమిషాలకు ఒక డయల్ 100కాల్స్ వచ్చాయి, కాల్స్ వచ్చిన వెంటనే తమ పోలీసు బృందాలు సంఘటన స్థలాలకు చేరుకున్నాయి.లోక్ అదాలత్ ద్వారా 11,440 కేసులు, 70,791 పెట్టీ కేసులను పరిష్కరించారు. 165 మందిపై రౌడీ షీట్లు తెరిచామని సీపీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా రూ.16 కోట్ల నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.23 నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటికి తెర వేశామని సీపీ వివరించారు.సైబర్ నేరాల్లో రూ.22 కోట్లను బాధితులకు తిరిగి ఇప్పించడం జరిగింది.


Read More
Next Story