PV SINDHU |వేడుకగా పీవీ సింధూ నిశ్చితార్థం
x

PV SINDHU |వేడుకగా పీవీ సింధూ నిశ్చితార్థం

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ నిశ్చితార్థం వేడుకగా సాగింది.వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో పీవీ సింధూ నిశ్చితార్థ వేడుక కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది.


భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ, హైదరాబాద్ నగరానికి చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో నిశ్చితార్థ వేడుక శనివారం కోలాహలంగా జరిగింది. ఈ నెల 22వతేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

- తన నిశ్చితార్థ వేడుక గురించి ఫొటోను షేర్ చేస్తూ పీవీ సింధూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. ‘‘ఒకరి ప్రేమ మనకు దక్కినపుడు మనం కూడా తిరిగి ప్రేమించాలి, ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు’’అని లెబనీస్ కవి ఖలీల్ జిబ్రాన్ క్యాప్షన్ ను పీవీ సింధూ జోడించారు.
- హైదరాబాద్ నగరంలో డిసెంబరు 24వతేదీన పీవీ సింధూ, వెంకటదత్త సాయిల విందు ఉంటుంది. కాబోయే దంపతులు పీవీ సింధూ, వెంకట దత్త సాయిలు కలిసి వెళ్లి తమ వివాహానికి రమ్మని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు జయశంకర్,కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్, కింజరాపు రాంమోహన్ నాయుడు, రక్షా ఖడ్సే, శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజు, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులను ఆహ్వానించారు.






Read More
Next Story