హైదరాబాద్‌లో విదేశీ వనితలతో వ్యభిచారం రాకెట్,గుట్టు రట్టు
గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో విదేశీ వనితలతో గుట్టుగా వ్యభిచారం దందాను ముఠాలు సాగించాయని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ దందాతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రొఫెసర్స్ కాలనీలోని మూడు అంతస్తుల భవనంలో 17 మంది విదేశీ వనితలతో వ్యభిచారం చేస్తుండగా, హైదరాబాద్ స్సెషల్ పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కెన్యాకు చెందిన 14మంది మహిళలు, ఉగండా దేశానికి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి చెందిన ఓ మహిళలతో వ్యభిచారం చేయిస్తుండగా హైదరాబాద్ పోలీసులు వారిని రక్షించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు శివకుమార్, మరో ఇద్దరు విటులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఆన్‌లైన్‌లో కస్టమర్ల గ్రూపు
విదేశీ వనితలను అక్రమంగా హైదరాబాద్ కు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆన్ లైన్ లో కస్టమర్ల గ్రూపును ఏర్పాటు చేసి వ్యభిచారం చేయిస్తున్నారని వెల్లడైంది. వ్యభిచార నిర్వాహకుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రూ.20వేల నగదు, 104 కండోమ్ లు, హుక్కా పాట్స్,25 హెచ్ఐవీ కిట్ లు,మూడు సెక్స్ టాయ్ లు, ల్యాప్ టాప్, ట్యాబ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, పబ్‌లు,ఫాం హౌస్‌లు, ఓయోరూమ్‌లలో ఈ దందా సాగుతుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
వాట్సాప్,కాల్ సెంటర్ల సాయంతో...
15 నగరాలకు చెందిన యువతులను సైబరాబాద్ కు రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. వాట్సాప్, కాల్ సెంటర్లు,వెబ్ సైట్,ప్రకటనల ద్వారా విటులను ఆకర్షిస్తూ ఈ బాగోతాన్ని నడిపిస్తున్నారని తేలింది.హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ ప్రాంతంలోని ఓ లాడ్జీ కేంద్రంగా హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.లాడ్జీలో విటులు, వ్యభిచారిణులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
విటులకు డ్రగ్స్ సరఫరా
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, అసోం, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, ఉజ్బెకిస్థాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం దందా నడిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వ్యభిచారం రాకెట్ ఉచ్చులో 14,190 మంది మహిళలు చిక్కుకున్నారని తమ దర్యాప్తులో వెల్లడైందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. విటులకు డ్రగ్స్ కూడా అందిస్తున్నారని తేలింది.మాసాబ్ ట్యాంకుకు చెందిన అర్నవ్ వ్యభిచార రాకెట్ నాయకుడిగా వ్యభిచారం దందా సాగించారు.
ఈ దందాలో ఎవరి వాటా ఎంతంటే...
తలా పాపం తలా పిడికెడు అన్నట్లు వ్యభిచార దందా సాగుతోంది. వ్యభిచారం వల్ల వచ్చిన డబ్బులో 30శాతాన్ని అమ్మాయిలకు, 35 శాతం ప్రచారం, వెబ్ సైట్ నిర్వహణకు, మరో 35 శాతం వ్యభిచార గృహం నిర్వాహకులకు వెళుతుందని పోలీసులు చెప్పారు. పలు నగరాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్ ఓయో రూంలకు రప్పించి కాల్ సెంటర్ ద్వారా విటులను రప్పించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.వాట్సాప్ ద్వారా విటులకు వల వేసి వారిని ఓయోరూంలకు రప్పించారని తేలింది. స్కోక్కా. ఇన్, లోకాంటో, వివా స్ట్రీట్ తదితర వెబ్ సైట్లను ఉపయోగించి హైదరాబాద్ కేంద్రంగా ఈ హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహించారని వెలుగు చూసింది.
గుట్టుగా వ్యభిచార దందా
గతంలో బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌తో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఖైరతాబాద్‌లో ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచార దందా నిర్వహిస్తుండగా గతంలో పోలీసులు పట్టుకున్నారు.వ్యభిచారం నిర్వహిస్తున్న జూనియర్ ఆర్టిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్టార్ హోటళ్లలోనూ సాగుతున్న దందా
ఢిల్లీ నుంచి 8 మంది యువతులను హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లకు రప్పించి వారితో సెక్స్ రాకెట్ నడిపారని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. లొకంటో వెబ్ సైట్ ద్వారా విటులకు వల వేశారని పోలీసులు చెప్పారు.రోజుకు రూ.40వేల చొప్పున ఇచ్చి బీటెక్ చదివే అమ్మాయిలను కూడా ఈ వ్యభిచారం రొంపిలోకి నిర్వాహకులు దించారని వెల్లడైంది.
డేటింగ్ స్కామ్
హైదరాబాద్ నగరంలో ఇటీవల డేటింగ్ స్కామ్ బయటపడింది. ఢిల్లీ నుంచి అమ్మాయిలను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి టిండర్, ఇతర డేటింగ్ యాప్ ల సాయంతో వ్యాపారులకు వల వేశారు. అమ్మాయిలు వ్యాపారులను పబ్ కు తీసుకువెళ్లి వారితో ఖరీదైన మద్యం తాగించి లక్షల రూపాయల మేర టోకరా వేశారు.
Next Story