Ponnam Prabhakar |ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు,రిప్రజెంటేషన్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చార్జిషీట్లు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ తమ ఏడాది పాలనపై ఇచ్చింది చార్జిషీట్లు కాదని రిప్రజెంటేషన్ లుగా భావిస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
- బీజేపీ ,బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదని, వాళ్లు ఇచ్చిన చార్జిషీట్ల ప్రజెంటేషన్ ను బట్టి తెలుస్తుందన్నారు. చార్జిషీట్ పార్టీలు మాకు ఇచ్చిన వాటిని రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామని మంత్రి ప్రకటించారు.
‘‘సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన చార్జిషీట్ ఫైల్ చేసినా బాగుంటుండే, కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్లీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు,ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారు...రెండు ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గమనించాలి’’ అని పొన్నం పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలను పరిశీలిస్తాం
ప్రతిపక్షాలు ఇచ్చిన చార్జిషీట్ అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
కలవని బండి సంజయ్
పని ఒత్తిడి వల్ల తాను స్వయంగా కలవలేక పోతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ టెలిపోన్ లో తెలిపారు..ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తనకి ఆహ్వాన పత్రిక అందినట్లు కేంద్ మంత్రి బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు టెలిఫోన్ లో చెప్పారు.ఎఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీఅసదుద్దీన్ ఓవైసీ ఇంకా అందుబాటులోకి రాలేదని ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రికను అధికారుల ద్వారా పంపామ,ని అసదుద్దీన్ ఓవైసీ సమయం ఇవ్వగానే వెళ్లి కలిసి ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Next Story