ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు
x

ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు

ఫోక్ సాంగ్స్ ఇష్టంగా వినే వాళ్లందరికి మల్లిక్ తేజ్ సుపరిచితమే. ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన ఎన్నో పాటల్లో కనిపించే సింగర్ ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులను..


రంగుల లోకంలో తళుక్కున మెరవాలని ఎన్నో ఆశలతో అడుగు పెడుతున్న అతివలు అవకాశాల పేరిట లైంగిక దోపిడికి గురవుతున్నారు. మీకు అవకాశం ఇస్తే మాకు ఏం ఒరుగుతుందని, మా అవసరం తీరిస్తేనే మీకు అవకాశం అంటూ మభ్యపెడుతున్నారు. తమ ప్రతిభను తెరపై చూసి మెరిసి మురిసి పోవాలనుకుంటున్న యువతులు వారు కోరినదానికి అంగీకరిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనలే మనం బిగ్ స్కీన్, బుల్లితెరపై చూస్తూ ఉంటాం.

ఇప్పుడు ఈ జాఢ్యం జానపద కళాకారులు, యూట్యూబ్ లో పాటలు చేసే రంగానికి సోకింది. ఫోక్ సాంగ్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగిత్యా సింగర్, మరో ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. తనను అవకాశాల పేరిట, మాయమాటలతో స్టూడియోలోనే చాలా సార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. దీనిపై జగిత్యాల పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు.

తెలంగాణ ఫోక్ సాంగ్ లు ఇష్టంగా వినేవారందరికి మల్లిక్ తేజ్ సుపరిచితమే. ఆయన ప్రొడక్షన్ వస్తున్న అన్ని పాటల్లోనూ ఓ సింగర్ కు ప్రత్యేక స్థానముండేది. అయితే ఈ అవకాశాల పేరిట తనను లైంగిక దోపిడి చేస్తున్నాడని, చాలాకాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సదరు సింగర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తనను పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధిస్తున్నాడని, అలాగే తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని, ఫోన్ చేసి దుర్భాషలు ఆడుతున్నాడని యూట్యూబర్ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన పాస్ వర్డ్ లను మార్చిన మల్లిక్ తేజ్ వాటిని తన ఖాతాలుగా ఉపయోగించుకున్నాడని ఆరోపించింది.
టాలీవుడ్ లో కొన్ని రోజుల క్రితం జరిగిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది. తనకింద పని చేసే నృత్య సహాయకురాలను ఇలాగే ముంబై తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ కావడంతో ఆయనపై ఫోక్సో కేసు కింద కూడా కేసు నమోదు చేశారు.
అలాగే మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోమని వేధించాడని, తనక వచ్చే అవకాశాలను కూడా రాకుండా చేయడం, ఇంటికెళ్లి తల్లిదండ్రులపై దాడులకు పాల్పడినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ వేధింపులు పరాకాష్టకు చేరడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తేలింది.
దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అలాగే ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పై కూడా ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా టాలీవుడ్ లో జరిగిన అనేక విషయాలను చాలా సార్లు తన సామాజిక ఖాతాల ద్వారా ప్రస్తావించి ప్రకంపనలు సృష్టించింది. కౌర్ చేసిన ఆరోపణల జాబితాలో ప్రముఖ దర్శకుడు, అగ్ర హీరో సైతం ఉన్నారు. అయితే వీటిని టాలీవుడ్ పెద్దలు సరిగా స్పందించిన దాఖలా లేదు.



Read More
Next Story