Patnam Sruthi Reddy
x

Patnam Sruthi | పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి.. పట్నం శృతి డిమాండ్

తన భర్త అరెస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలను మరిచారంటూ పట్నం శ్రుతి.. హైకోర్టును ఆశ్రయించారు.


బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల(Lagacharla)లో కలెక్టర్‌పై దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ అరెస్ట్ అయి.. పోలీసుల కస్టడీలో ఉన్నారు. తాజాగా తన భర్త అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన భార్య పట్నం శృతి(Patnam Sruthi).. కోర్టును ఆశ్రయించారు. తన భర్తను సుప్రీంకోర్టు(Supreme Court) మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. ఇందుకు గానూ పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబంధనలను గాలికొదిలేశారని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో పాటించాల్సిన ఏ నిబంధనను వాళ్లు పాటించలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడినంత మాత్రాన దాడి చేయించినట్లు కాదని ఆమె అన్నారు.

ఏ నిబంధనా పాటించలేదు..

‘‘నా భర్త పట్నం నరేందర్‌ను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. దోషులను పెట్టినట్లు పలువురు ఖైదీలతో కలిసి చర్లపట్టి జైలులో ఉంచారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ నా భర్తను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు ఆ నిబంధనలను తుంగలో తెక్కారు. కావున నా భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి’’ అని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పట్నం శృతి పిటిషన్ దాఖలు చేశారు.

పట్నం నరేందర్ అరెస్ట్ అందుకే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండటం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు ఇతర అధికారులు లగచర్ల, పోలేపల్లికి చేరుకున్నారు. కాగా అక్కడ వారికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురైంది. అధికారులక వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు నినాదాలు చేశారు. అంతేకాకుండా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్, సురేష్ పదుల సంఖ్యలో ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్ కూడా సురేష్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగానే కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో వెలల్లడైంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసం డీజీపీ ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సురేష్‌పై ఇప్పటికే అత్యాచారం సహా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సురేష్‌పై ఉన్న కేసులను తొలగించడం కోసం పట్నం రేందర్ కీలకంగా వ్యవహరించారిన కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. పట్నం రేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More
Next Story