చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్ట్
x

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్ట్

ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీతో పాటు ఇటీవల ఆమె వివాహం చేసుకున్న వర్షిణిని కూడా పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.


లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో రూ.లక్షల్లో మోసం చేయడమే అఘోరీ అరెస్ట్‌కు కారణమైంది. ఓ సినీ లేడీ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పూజల పేరుతో తన దగ్గర నుంచి రూ.9.5లక్షలు తీసుకుని అఘోరీ మోసం చేసిందంటూ ప్రొడ్యూసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన మోకిలా పోలీసులు.. లేడీ అఘోరీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీతో పాటు ఇటీవల ఆమె వివాహం చేసుకున్న వర్షిణిని కూడా పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదులో ఏం ఉందంటే.. వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం రూ. 5 లక్షలు లేడీ అఘోరీ అకౌంట్ లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫాం హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి రూ.5 లక్షలు అకౌంట్ లో వేశానని ఇలా మొత్తం రూ. 10 లక్షలు ముట్టజెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలుసుగా చేసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని లేదంటే నిన్ను, కుటుంబ సభ్యులను మంత్ర శక్తులతో అంతమొందిస్తానని.. బెదిరింపులకు పాల్పడ్డట్లు కంప్లైంట్ లో పేర్కొంది.

Read More
Next Story