లోక్ సభలో తెలంగాణ వాణి వినిపించిన మన ఎంపీలు
x
లోక్ సభలో మాట్లాడుతున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

లోక్ సభలో తెలంగాణ వాణి వినిపించిన మన ఎంపీలు

లోక్‌సభలో పార్లమెంట్ సభ్యులు తెలంగాణ వాణిని వినిపించారు.పార్లమెంటుకు హాజరులో ఎంపీ చామల, ప్రశ్నల్లో ఈటెల, డిబేట్లలో అసదుద్దీన్ ఒవైసీ అగ్రస్థానంలో నిలిచారు.


తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు పార్లమెంటులో తెలంగాణ సమస్యలను లేవనెత్తారు. భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వందశాతం హాజరుతో పార్లమెంటులో 79 ప్రశ్నలు అడిగి అధికార ఎన్డీఏ పక్షాన్ని నిలదీశారు. మల్కాజిగిరికి చెందిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంటులో 80 ప్రశ్నలు అడిగి తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచారు. మరో వైపు 95 శాతం హాజరుతో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు. పార్లమెంటులో జరిగి 21 డిబేట్లలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొని చర్చల్లో అగ్రస్థానంలో నిలిచారు.


తెలంగాణ ఎంపీల రికార్డ్
చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధికంగా వంద శాతం పార్లమెంట్ సమావేశాలకు హాజరై రికార్డు సృష్టించారు. పార్లమెంటులో ఈటెల రాజేందర్ 80 ప్రశ్నలు అడిగి అగ్రస్థానంలో ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసద్ ఒవైసీ 21 డిబేట్‌లకు నాయకత్వం వహించారు.అయితే నల్గొండ ఎంపీ జానా రెడ్డి కుమారుడు కుందూరి రఘువీర్ రెడ్డి ప్రశ్నలు, హాజరు, డిబేట్ల మూడింటిలోనూ అత్యల్ప స్థానంలో నిలిచారు.



ఇదీ తెలంగాణ ఎంపీల ప్రొగ్రెస్ రిపోర్ట్

పార్లమెంటులో 2024 జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీ వరకు జరిగిన సమావేశాల్లో తెలంగాణ ఎంపీల పనితీరును లోక్ సభ సచివాలయం తాజాగా విడుదల చేసింది.ప్రశ్నలు అడగడంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అగ్రస్థానం పొందారు. 91.17 శాతం పార్లమెంటులో హాజరవడంతో పాటు 9 చర్చల్లో పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 17 చర్చల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డి.కె. అరుణ పార్లమెంటు సమావేశాలకు 88.23 శాతం హాజరై 73 ప్రశ్నలు అడిగి, 14 చర్చల్లో తన గళం వినిపించారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ 62 ప్రశ్నలు, 5 చర్చల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి 59 ప్రశ్నలు సంధించారు.

తక్కువ ప్రశ్నలడిగిన ఎంపీలు

పార్లమెంటులో ప్రశ్నలు అడగడంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్,చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి దిగువన ఉన్నారు. రఘువీర్ రెడ్డి 8 ప్రశ్నలు, బలరాం నాయక్ 13 ప్రశ్నలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి 18 ప్రశ్నలు,మల్లు రవి 28 ప్రశ్నలను లోక్ షభలో వేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రఘురామ్ రెడ్డి 56 ప్రశ్నలు లేవనెత్తారు. అసదుద్దీన్ ఒవైసీ 54 ప్రశ్నలు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు 46 ప్రశ్నలు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ 40 ప్రశ్నలు వేశారు.పెద్దపల్లి ఎంపీ జి.వంశీ కృష్ణ 31 ప్రశ్నలు, వరంగల్ ఎంపీ కడియం కావ్య 31 ప్రశ్నలు సంధించారు. పార్లమెంట్ లో వంద శాతం హాజరుతో చామల కిరణ్ కుమార్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంపై 79 ప్రశ్నలు సంధించారు.


Read More
Next Story