అమెరికాలో పెట్రేగుతున్న గన్ కల్చార్.. మరో తెలుగు విద్యార్థి మృతి
x

అమెరికాలో పెట్రేగుతున్న గన్ కల్చార్.. మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెట్రేగిపోతోంది. దీని వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.


అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకు పెట్రేగిపోతోంది. దీని వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ దుండగుడు జరిపిన కాల్పులను కోటి ఆశలతో అగ్రరాజ్యానికి వెళ్లిన తెలుగు యువకుడు ఆసువులు బాసాడు. ఖమ్మం రూరల్ ప్రాంతానికి చెందిన సాయితేజ దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మరణ వార్త తెలిసిన కుటుంబీకులు కన్నీమున్నీరవుతున్నారు. పైచదువుల కోసమని అమెరికా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లడిల్లుతున్నారు. ఈ విషయంతో వారి ఊరంగా విషాదఛాయలు అలముకున్నాయి. సాయితేజ మరణంపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందుకోసం ఇప్పటికే సీసీటీవీ కెమెరాలను చెక్ చేస్తున్నామని, చుట్టు పక్కల ఉన్న సీసీటీవీలను కూడా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

అయితే ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల కుమారుడు సాయితేజ. ఉన్నత చదువుల కోసమని 4నెలల క్రితం అతడు అమెరికాకు పయనమయ్యాడు. అమెరికాలో చదువుకుంటూనే ఒక షాపింగ్ మాల్‌లో స్టోర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అటువంటి శుక్రవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం) ఒంటిగంట ప్రాంతంలో ఇద్దరు దుండగులు సాయితేజ పనిచేస్తున్న స్టోర్‌కు వచ్చారు. వచ్చీ రాగానే.. కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయితేజ మరణించాడు. అనంతరం కౌంటర్‌లోని నగదు తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

కోటేశ్వరరావు, వాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ల కూతరు రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అక్కడే చదువను కొనసాగిస్తోంది. ఇటీవల నాలుగు నెలల క్రితం కుమారుడు సాయితేజ కూడా అమెరికాకు వెళ్లాడు. ఇప్పుడు సాయితేజ మరణంతో వారి కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా వారి కుటుంబీకులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డి ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. సాయితేజ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఇక్కడకు తీసుకురావడానికి వీలైనంత సహాయం చేస్తామని చెప్పారు.

Read More
Next Story