ప్రేమ పేరిట నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం
x

ప్రేమ పేరిట నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయంతో ఓ నర్సింగ్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన నగరంలో జరిగింది.


హైదరాబాద్ నగరంలో ఓ యువతి బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతోంది. నాగార్జున సాగర్ కు చెందిన చెరుకుపల్లి విజయకుమార్ అనే యువకుడు తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినితో పరిచయం చేసుకున్నాడు. ముందు స్నేహితుడినని చెప్పి, ఆ తర్వాత ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించడం మొదలెట్టాడు.

గతంలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను చూపిస్తానని చెప్పి బెదిరించాడు. నర్సింగ్ విద్యార్థిని కళాశాల నుంచి తిరిగి వస్తుండగా విజయకుమార్ ఆమెను బలవంతంగా నగరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని హయత్ నగర్ పోలీసులు చెప్పారు.


తనపై అత్యాచారం చేయడమే కాకుండా తన తల్లిదండ్రులు, బంధువులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయకుమార్ పై తాను గతంలో నాగార్జునసాగర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పారు. యువతి ఫిర్యాదు మేర హయత్ నగర్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుడైన విజయకుమార్ కోసం గాలిస్తున్నారు.



Read More
Next Story