KTR | ‘దమ్ముంటే అందలం దిగి రా’.. రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్
x

KTR | ‘దమ్ముంటే అందలం దిగి రా’.. రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్

కరీంగనర్‌లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.


కరీంగనర్‌లో నిర్వహించిన దీక్ష దివస్ (Diksha Diwas) కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్(KTR).. రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సీఎం సీటులో కూర్చని మాట్లాడటం కాదని, దమ్ముంటే అందలం దిగిరావాలని, ఏడాది పాలన ఎలా ఉందే ప్రజలే చెప్తారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని రెచ్చొపోవద్దని, అధికారం శాశ్వతం కాదంటూ హితవు కూడా పలికారు. ఈ రోజు నీదగ్గర అధికారం మాత్రమే ఉందని, తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేటీఆర్ దగ్గరే ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మరోసారి పోరుబాట పట్టాల్సి వస్తోందని, అందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న చేతకాని ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ సర్కార్‌పై విసుర్లు విసిరారు. అంతేకాకుండా తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్ ప్రజలని, వారు తమ ఉద్యమ స్ఫూర్తి చూపకుంటే ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్‌ఎస్ సాధించిందని వివరించారు కేటీఆర్.

కేసీఆర్ ఏనాడు కూడా పదవుల కోసం పోరాడలేదని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే పోరాటం కొనసాగించారిన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనదంటూ కొనియాడారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్లు కూడా ఈరోజు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆనాడు మనపైకి తుపాకులు గురిపెట్టినోళ్లు ఈరోజు మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్వలు వెల్లువెత్తించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే వీళ్లంతా కూడా నాంపల్లి దర్గా దగ్గర అడుక్కుతింటుండే వాళ్లని, అలాంటి వాళ్లు వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించుకున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే దుయ్యబట్టారు.

రేవంత్ అదృష్టవంతుడు

‘‘రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు. ఈరోజు అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయనకు ఒకటే చెప్తున్నా నీ దగ్గర అధికారం ఉందేమో కానీ తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్, గులాబీ జెండాకే ఉంది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలులతో అరచేతిలో వైకుంఠం చూపించారు కాంగ్రెస్ నాయకులు. దొంగమాటలు, నంగనాచి కబుర్లు చెప్పి గెలిచారు. కానీ ఎప్పటికైనా తెలంగాణ చరిత్ర రాసినప్పుడు కేటీఆర్.. హిమాలయ పర్వతమంత ఎత్తులో ఉంటే.. ఆయన కాలి గోటికి కూడా మీరు సరితూగరు. ఇది అక్షర సత్యం. దమ్ముంటే అందలం దిగిరా.. నీ ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెప్తారు. నీ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలంటే రాష్ట్రంలోని ఏ ఊరికైనా, తండాకైనా, బస్తీకైనా వెళ్లు’’ అంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.

ఒక్క వర్గానికి లేని సంతోషం

‘‘కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేదరు. ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. హాస్టల్‌లో ఆహారం తింటే ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు తిందితిప్పలు లేక ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ మార్చి తీరు ఇది. ఇదేమీ పట్టనట్లు వారి పాటికి వాళ్లు ప్రజా విజయోత్సవాలు చేసేస్తున్నారు. వచ్చే నాలుగేళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నా. కాంగ్రెస్ ఇచ్చిన చిట్టచివరి హమీ కూడా అమలయ్యే వరకు పోరాటం చేద్దాం. ప్రజల్లో బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న నమ్మకాన్ని పెంచుదాం’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం ఆయన తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడారు.

తెలంగాణకు అన్యాయం జరిగింది

‘‘1956-1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగింది. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైంది. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారు. 1971 నుంచి 30 ఏళ్ల పాటు మేధావులు, ఉద్యమకారులు సరైన సమయం కోసం ఎదురుచూశారు. అప్పుడు కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాటపట్టారు. పదవులు త్యాగం చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ను స్థాపించారు. రాజీలేని పోరాటం చేశారు. చావు నోట్లో తలపెట్టి మరీ తెలంగాణను సాధించారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ సాధ్యమైంది. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంతో విధిలోని పరిస్థితుల కారణంగా 2014 జులై 2న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. సోనియా.. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితులు ఉన్నాయని కొందరు అంటున్నారు. వాళ్లు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Read More
Next Story