‘ఎవరు అడ్డొచ్చినా కులగణన చేసి తీరుతాం’.. తేల్చి చెప్పిన మంత్రి పొన్నం
x

‘ఎవరు అడ్డొచ్చినా కులగణన చేసి తీరుతాం’.. తేల్చి చెప్పిన మంత్రి పొన్నం

కుల గణన విషయంలో తమ ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తోందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.


కుల గణన విషయంలో తమ ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తోందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చాలా మంది కుల గణనను వ్యతిరేకిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారందిరకీ తాను చెప్పేది ఒకటే అని, ఎవరు ఎంత ప్రయత్నించినా కుల గణన ఆగే ప్రసక్తే లేదని, అన్నీ అనుకున్నట్లే పక్కాగా జరుగుతాయని తేల్చి చెప్పారాయన. ఈ రోజు విజయవాడ కనదుర్గ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.

ఈ సందర్బంగానే తెలంగాణలో చేపట్టనున్న కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు. కులగణను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు, కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అది సాధ్యమయ్యే పని కాదని, ఎట్టిపరిస్థితుల్లో కులగణను చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తేటతెల్లం చేశారు. ఏది ఏమైనా కుల గణన జరిగి తీరుతుందని, కుల గణన వల్ల సమాజాభివృద్ధి సులభతరం అవుతుందని వివరించారు.

ఎవరికి ఎంత సహాయం కావాలి, ఎంత మందికి ఎలాంటి సహాయం కావాలని అన్న ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మందికి మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను రూపొందించడం ఈ కుల గణన వల్ల సులభతరం అవుతోందని ఆయన వివరించారు. ఎవరు కాదన్నా కుల గణన ఆగదని వెల్లడించారు.

తెలంగాణ దిక్సూచి కావాలి

‘‘కుల గణను ఎటువంటి అవకతవకలకు స్థానం లేకుండా చేపట్టనున్నాం. ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ ఉంటారు. కులగణన ద్వారా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా మారాలి. కుల గణన గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కుల గణను చేసి తీరుతాం. కుల గణనతో సమాజంలో సహాయం కావాల్సిన వారిని కనుగొనడం సులభం అవుతుంది. అదే విధంగా వారికి ప్రభుత్వం సహాయం చేయడం కూడా వేగంగా జరుగుతుంది’’ అని ఆయన చెప్పారు. అనంతరం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు. వీటిలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

కోర్టు తీర్పుల ప్రకారమే..

స్థానిక సంస్థ బీసీ రిజరవేషన్ల విషయంలో వచ్చే న్యాయపరమైన చిక్కుల గురించి సీఎం తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా అనుసరిస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం కోసం కోర్టు ఇచ్చే తీర్పులను తప్పకుండా అనుసరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషక్ష్ంలో అందరి అభిప్రాయాలను సేకరించామని, వాటి మేరకు వెంటనే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, స్థానిక సంస్థ రిజర్వేషన్ల విషయంలో కూడా పూర్తి పాదర్శకతను అనుసరిస్తామని స్పస్టం చేశారు. ఇదే విషయంలో సీఎం కూడా అధికారులను అప్రమత్తం చేశారు.

కుల గణనలో ఇవే కీలకం

కుల గణనను ఐదు అంశాలు కీలకంగా చేపట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇందులో కులాన్ని కూడా కలిపితే ఆరు అంశాలు కీలకం కానున్నాయని ఆయన అన్నారు. ఈ సర్వేలో విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనకబాటుతనం వంటి అంశాలు ఉండనున్నాయని చెప్పారు. వీటికి సంబంధించి సమగ్ర డేటాను సేకరించనున్నామని, కులాల ఆధారంగా వివిధ వివరాలను సేకరటించడం ద్వారా ప్రతి కుటుంబానికి లభిస్తున్న అవకాశాలను అంచా వేస్తూ భవిష్యత్తులో వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికి సులభతరమవుతుందని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఏ పథకం తీసుకురావడం ద్వారా అధిక మొత్తం ప్రజలకు మేలు చేయొచ్చు అన్న అంశాలను పరిశీలించడం, ఎక్కువ మందికి సంక్షేమం అందించే పథకాలు తీసుకురావడం ప్రభుత్వానికి తేలికగా మారుతుందని చెప్పారు.

Read More
Next Story