అభివృద్ధిలో ఉత్తమ మండలంగా నార్నూర్, నీతి ఆయోగ్ ప్రశంసలు
x
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అవార్డు అందుకుంటున్న ఆదిలాబాద్ కలెక్టరు రాజర్షి షా

అభివృద్ధిలో ఉత్తమ మండలంగా నార్నూర్, నీతి ఆయోగ్ ప్రశంసలు

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల బ్లాక్ అభివృద్ధి పనుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ విభాగం నార్నూర్ మండలాన్ని ఎంపిక చేసింది.


అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ లోని నార్నూర్ మండలం పేరు నేడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దేశంలో అయిదు ఉత్తమ బ్లాక్ లలో నార్నూర్ ఒకటిగా నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. నార్నూర్ మండల అభివృద్ధికి గాను గుర్తింపుగా సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు అవార్డును ప్రదానం చేశారు.




నార్నూర్ మండలంలో ఏం చేశారంటే...

నార్నూరులో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల కల్పన, అభివృద్ధిలో నార్నూర్ మండలాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అగ్రస్థానంలో నిలిపారు.ప్రతీ ఏటా అంటువ్యాధులతో సతమతమయ్యే నార్నూర్ మండలంలోని మారుమూల గిరిజన తండాలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేయించి గిరిజనులకు పోషణ మిత్ర పథకం కింద ఐరన్ టాబ్లెట్లు, ఇప్పపువ్వు లడ్డూలను పంపిణీ చేశారు. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి బాటలు వేశారు. సేంద్రీయ సేద్యం, నీరుపారుదల సౌకర్యాల కల్పనతో వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద మంచినీటి సరఫరాను మెరుగుపర్చారు. నార్నూర్ మండలంలో కరూ.30కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.



ప్రధాని నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్

ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కార అవార్డును ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సోమవారం ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అందుకున్నారు.జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్ బ్లాక్ అస్పరెషనల్ ప్రోగ్రాం 2024 లో అవార్డు వచ్చింది. నార్నూర్ బ్లాక్ అస్పరెషనల్ ప్రోగ్రాం 2024 కు గాను జిల్లా కలెక్టర్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024లో నార్నూర్ బ్లాక్ దేశంలో టాప్ 5 లో ఎంపిక అయింది.

ఉత్తమ మండలంగా నార్నూర్

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ బ్లాక్ అభివృద్ధి చేయడంతో నీతి ఆయోగ్ ఉత్తమ మండలంగా ఎంపిక చేసింది. నార్నూర్ లో అభివృద్ధి చేయడం ద్వారా మార్పు తీసుకువచ్చారు. ఇప్పపువ్వ లడ్డూ ద్వార విద్యార్థులకు పోషకాహారాన్ని అందించారు.సీఎస్సీ సెంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ సాంకేతికతపై శిక్షణ ఇచ్చారు. వైద్య పరీక్షలు మెరుగుపర్చి, పాఠశాలల్లో సైన్స్ టెక్నాలజీ ల్యాబ్ లు ఏర్పాటు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితోనే నార్నూర్ మండలానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించిందని కలెక్టర్ రాజర్షిషా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నార్నూర్ స్ఫూర్తితో ఆదిలాబాద్ జిల్లాలోని మిగతా మండలాలను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.


Read More
Next Story