మోడి ప్రసన్నం కోసం పోటీ పడుతున్నారా ?
x

మోడి ప్రసన్నం కోసం పోటీ పడుతున్నారా ?

తెలుగురాష్ట్రాలకు సంబంధించి గురువారం ఢిల్లీలో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది.


తెలుగురాష్ట్రాలకు సంబంధించి గురువారం ఢిల్లీలో దగ్గర ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే డిమాండ్ల చిట్టా పట్టుకుని చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ప్రధానమంత్రని కలిశారు. మోడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలుచేశారు. తప్పదు నరేంద్రమోడి ప్రధానమంత్రిగా ఉన్నంతవరకు ఏ ముఖ్యమంత్రికి అయినా ఇది తప్పదేమో. ఎందుకంటే నాన్ బీజేపీ ముఖ్యమంత్రులను మోడి పెద్దగా పట్టించుకోవటంలేదు. ఇపుడు చంద్రబాబునాయుడు ఎన్డీయేలో పార్టనర్ గా ఉన్నారు కాబట్టి అందులోను టీడీపీ మద్దతు కీలకం కాబట్టే మోడి ఈమాత్రమైనా మాట్లాడారు. ఒకపుడు అంటే 2014-19 మధ్యలో ఎన్డీయే పార్టనరే అయినా చంద్రబాబును మోడి అసలు దగ్గరకు కూడా రానీయలేదు. చివరకు ఇక లాభంలేదని అర్ధమైపోయి 2018లో ఎన్డీయేలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

ఇక్కడ విషయం ఏమిటంటే రెండు రాష్ట్రాల అభివృద్ధి కూడా కేంద్రం నిధులపైనే ఆధారపడుంది. తెలంగాణాకు రాజధానిగా హైదరాబాద్ ఉందని పేరే కాని మిగిలిన రాష్ట్రాభివృద్ధి అంతా డొల్లే. కాబట్టి ప్రతి ప్రాజెక్టు కేంద్రం మంజూరు చేయాల్సిందే, ప్రాజెక్టులు, పథకాల అమలుకు కేంద్రం నిధులు మంజూరుచేయాల్సిందే. ఇదే సమయంలో ఏపీ పరిస్ధితి మరీ అన్యాయం. చంద్రబాబు టాప్ ప్రయారిటి అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు. ఈ రెండు సాకారం కావాలంటే మోడి చల్లనిచూపు చాలా చాలా అవసరం. ఈ రెండింటి కోసమే చంద్రబాబు ప్రత్యేకహోదా, విశాఖపట్నం రైల్వేజోన్ లాంటి కీలకమైన అంశాలను కూడా పక్కనపెట్టేశారు. ఏపీలో సంక్షేమపథకాలు అమలవ్వాలన్నా కేంద్రం నిధులివ్వాల్సిందే తప్ప వేరేదారిలేదు. అందుకనే మోడిని ప్రసన్నంచేసుకునేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మోడీతో భేటీ తర్వాత పియూష్ గోయెల్, నితిన్ గడ్కరీ తదితరులను కూడా కలిశారు.

అలాగే రేవంత్ కూడా మోడిని కలిశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణా ప్రాజెక్టులు, పథకాలకు నిధులు, విభజన హామీలను అమలుచేయాలని రిక్వెస్టు చేసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని, ఐఐటిఆర్ మంజూరుచేయాలని, ఖాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరుతో పాటు చాలా రిక్వెస్టులను మోడి ముందుంచారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పింది విన్నారు, అన్నీ రిక్వెస్టులను సానుకూలంగా స్పందించారు. అయితే చివరకు నోటిమాటతో కాకుండా నోటుమాటతో ఎన్ని సమస్యలను పరిష్కారిస్తారు, ఎన్ని నిధులు మంజూరు చేస్తారన్నది సస్పెన్సుగా మారింది.

Read More
Next Story