HYDRAA Commissioner Ranganath
x

HYDRAA | ‘నా ఇల్లు అక్కడ లేదు’.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా రంగనాథ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందా? ఇప్పుడు ఆయన ఇంటిని కూడా హైడ్రా కూల్చేస్తుందా?


గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలను కాపాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా(HYDRAA)ను తీసుకొచ్చింది. తొలి రోజు నుంచి కూడా హైడ్రా.. తన చర్యలతో టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ఎక్కడిక్కడ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ దూసుకుపోతోంది. ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎన్నో ఇళ్లను రివర్ బెడ్‌పై ఉన్నాయని చెప్తి కూల్చింది. దీంతో ఇది కాస్త ఇష్యూ కావడంతో తాజాగా కూల్చివేతలకు కాస్తంత విరామం వచ్చింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌(Ranganath)కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. రంగనాథ్ ఇళ్లు బఫర్ జోన్‌లో ఉంది? మరి ఇప్పు ఆయన ఇంటిపైకి కూడా హైడ్రా బుల్డోజర్లు వెళ్తాయా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ వార్తలు కొన్ని రోజులు అధికమవుతున్న క్రమంలో తాజాగా వాటిపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని స్పష్టం చేశారు.

మాది ఇప్పుడు కట్టిన ఇల్లు కాదు..

‘‘మధురానగర్ నేను నివాసం ఉండే ఇంటిని దశాబ్దాల క్రితం మా నాన్న కట్టించాడు. కృష్ణకాంత్ పార్క్‌కు దిగువల వేల ఇళ్ల తర్వాత మా ఇల్లు ఉంది. ఒకప్పటి చెరువనే కృష్ణకాంత్ పార్క్‌గా మార్చారు. చెరువుకట్టకు దిగువలన 10 మీటర్లు దాటిన తర్వాత నిర్మించే ఇళ్లు ఇరిగేషన్ నిబంధనల ప్రకారం బఫర్‌జోన్‌లోకి రావు. మా ఇల్లు చెరువు కట్టకు కిలోమీటరు దూరంలో ఉంది’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు సాక్ష్యంగా తన ఇంటి మ్యాప్‌ను కూడా ఆయన తన ఎక్స్‌(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసుకున్నారు.

హైడ్రా టార్గెట్ అదే..

పెరిగిపోతున్న చెరువులు, కుంటల ఆక్రమణలను అడ్డుకోవడం కోసం, ఇప్పటికే ఆక్రమణకు గురైన వాటిని పునరుద్దరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకొచ్చింది. ఈ హైడ్రాకు రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. ఇరిగేషన్ నిబంధనల ప్రకారం చెరువులను కబ్జా చేసి నిర్మించిన గృహాలను గుర్తించి కూలగొడుతోంది హైడ్రా. అదే విధంగా చెరువలోకి వర్షపు నీరు చేరకుండా బఫర్ జోన్‌లో నిర్మించిన కట్టడాలను కూడా నేలమట్టం చేస్తోంది. ఇలా చేయడం ద్వారా చెరువులు పునరుద్దరించబడుతాయి. దాంతో భూగర్భజలాలు పెరగడంతో పాటు చిన్నపాటి వర్షాలకు వరదలు వచ్చే ముప్పు తగ్గుతుంది. అదే విధంగా ట్రాఫిక్ జామ్ వంటి ఎన్నో సమస్యలు కూడా ప్రజలకు దూరమవుతాయని అధికారులు వివరిస్తున్నారు.

Read More
Next Story