Manoj Manchu | ఫామ్ హౌస్‌ నుంచి మనోజ్‌ తరిమేసిన మోహన్ బాబు..
x

Manoj Manchu | ఫామ్ హౌస్‌ నుంచి మనోజ్‌ తరిమేసిన మోహన్ బాబు..

మంచు ఫ్యామిలీలో వడగాలులు వీస్తున్నాయి. ఆస్తి గొడవలో, పాత మనస్పర్థలో కారణం ఏదైనా ప్రస్తుతం వారి కుటుంబ కథ చిత్రం అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.


మంచు ఫ్యామిలీలో వడగాలులు వీస్తున్నాయి. ఆస్తి గొడవలో, పాత మనస్పర్థలో కారణం ఏదైనా ప్రస్తుతం వారి కుటుంబ కథ చిత్రం అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. మంచు మనోజ్(Manoj Manchu), మంచు మోహన్ బాబు(Mohan Babu) ఇద్దరూ కూడా పరస్పరం పోలీసు ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని వారు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కాగా ఈరోజు ఉదయం నుంచి జల్‌పల్లిలోని ఫామ్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు.. తమది కుటుంబ సమస్య అని, దాన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని మీడియాతో అన్నారు. కానీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫామ్ హౌస్‌కు చేరుకున్న విష్ణు.. భారీ సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే మనోజ్ బౌన్సర్లకు, విష్ణు బౌన్సర్లకు మధ్య చిన్నపాట ఘర్షణ కూడా జరిగింది. కాగా ఇప్పుడు ఈ అంశం మరో కీలక మలుపు తీసుకుంది. మంచు మనోజ్‌ను ఫామ్ హౌస్ నుంచి వెళ్లగొట్టేశారు. పైగా ఇప్పుడు మూడు వాహనాల్లో మనోజ్.. సామాన్లను సర్దిస్తున్నారు మోహన్ బాబు. ఇల్లు తనదని, తన ఇంట్లో మనోజ్‌కు స్థానం లేదని అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మనోజ్.. డీజీపీని కలిసేందుకు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. తనకు న్యాయం జరిపించాలని కోరడానికి కంప్లైయింట్ పేపర్లతో సహా వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇంతలో మోహన్ బాబు ఇంటలో పనిచేసే మహిళ అంటూ ఒకామే చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోహన్ బాబు, మనోజ్ మధ్య చిన్నపాటి తోపులాటే జరిగింది తప్పా.. మనోజ్ చెప్తున్న స్థాయిలో కొట్టించలేదని ఆ మహిళ అంటోంది. మోహన్ బాబు స్టాప్‌పై మనోజ్ చేయి చేసుకున్నాడని, దాంతో ఆగ్రహించిన మోహన్ బాబు.. తన సిబ్బందిని టచ్ చేస్తే ఊరుకునేది లేదని మనోజ్‌కు వార్నింగ్ ఇచ్చాడట. కానీ వినిపించుకోని మనోజ్.. మోహన్ బాబు స్టాఫ్‌పై మరోసారి చెయి చేసుకోవడంతో.. తండ్రి కొడుకుల మధ్య గొడవ మొదలైందని ఆమె చెప్పింది.

కానీ ఆ సంఘటనలో మనోజ్‌పై మనుషులను పెట్టించి కొట్టించడం కానీ, తీవ్రమైన గాయాలయ్యేలా కొట్టించడం కానీ జరగలేదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే మనోజ్, విష్ణుకు మధ్య మాత్రం మనస్పర్థలు ఉన్నాయని, మౌనికను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో వివాదాలు పెరిగాయని ఆమె వివరించింది. మనోజ్.. మౌనికను పెళ్ళి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని, అప్పటి నుంచి వీరి కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉన్నాయని ఆమె చెప్పింది.

Read More
Next Story