కూతురిని చూసి కేసీఆర్ భావోద్వేగం (వీడియో)
x

కూతురిని చూసి కేసీఆర్ భావోద్వేగం (వీడియో)

ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు.


ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కేసీఆర్ స్టాఫ్ ఆమెకి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలికి స్వాగతం పలికారు. భర్త, కుమారునితో కలిసి కేసీఆర్ ని కలిశారు కవిత. తండ్రిని చూడగానే కాళ్ళకి నమస్కరించి ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ ఆమెకి ఆశీర్వాదం ఇస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

కాగా, ఆమె జైలుకెళ్లిన నాటి నుంచి కేసీఆర్ ని కలవడం ఇదే తొలిసారి. దాదాపు ఐదు నెలలు జైల్లో ఉన్నప్పటికీ ఆమెను కలిసేందుకు ఒక్కసారి కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళలేదు. ఆమె అనారోగ్యం పాలైనప్పుడు కూడా పరామర్శించడానికి కేసీఆర్ వెళ్ళకపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే మంగళవారం జైలు నుంచి విడుదలైన కవిత బుధవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి వెళ్లారు. ఇక ఈరోజు మధ్యాహ్నం తండ్రిని కలిసేందుకు ఎర్రవెల్లి వెళ్లారు.

పది రోజులు తండ్రివద్దే కవిత...

కవిత పదిరోజులు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో తండ్రివద్దే ఉండనున్నారు. ఈ పది రోజులు అభిమానులు, కార్యకర్తలని కలవలెనని తెలిపారు. అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ ఈడీ, సీబీఐ కేసుల్లో తీహార్ జైల్లో ఉన్న కవితకి మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మద్యం పాలసీ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందజేసింది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన షూరిటీ బాండ్లను ట్రయల్ కోర్టు స్వీకరించింది. అనంతరం ఆమెని అధికారులు తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి రిలీజ్ చేశారు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగే లిక్కర్ పాలసీ సీబీఐ కేసు చార్జ్ షీట్‌పై విచారణకు కవిత వర్చువల్ గా హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చారు.

Read More
Next Story