MLA KOUSHIK REDDY | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట,బెయిలు మంజూరు
x

MLA KOUSHIK REDDY | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట,బెయిలు మంజూరు

కరీంనగర్ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను దూషించి, అతన్ని చేత్తో నెట్టిన కేసులో నిందితుడైన పాడి కౌశిక్ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది.


కరీంనగర్ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను దూషించి చేత్తో నెట్టిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ కరీంనగర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ఉత్తర్వులు జారీ చేశారు.

- పోలీసులు మూడు కేసుల్లో నిందితుడిని కోర్టు ముందు హాజరు పర్చగా గురువారం లోగా పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు రావాలని జడ్జి ఆదేశించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని జడ్జి ముందు కోర్టుకు కౌశిక్ రెడ్డి చెప్పారు.
- ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేశారంటూ అతని పీఏ, అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ కరీంనగర్ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుల పై పోలీసులు కౌశిక్ పై మూడు కేసులు నమోదు చేశారు. తన అరెస్టు, కేసులు హైడ్రామా అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కౌశిక్ పండుగ రోజు రాజకీయాలు మాట్లాడనని చెప్పారు.
‘‘నిజం నిలిచింది… న్యాయం గెలిచింది!కరీంనగర్ కోర్టు ద్వారా కౌశిక్ అన్నకు బెయిల్ మంజూరు అయింది’’అని ఎక్స్ లో పోస్టు చేశారు.‘‘తెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు,ఇదీ హైడ్రామా, ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు’’ అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘సంక్రాంతి పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా,రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా.కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి, అర్థం చేసుకోగలరు’’అని కౌశిక్ వివరించారు.



Read More
Next Story