
మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పర్యాటక రంగాభివృద్ధి
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రచారం ఆరంభించింది.హైదరాబాద్ జరూర్ ఆనా అంటూ బాక్సర్ నిఖత్ జరీన్ వీడియో విడుదల చేశారు.
మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలక తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారం చేపట్టింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ రాష్ట్ర డీఎస్పీ నిఖత్ జరీన్ ప్రచార వీడియోను తెలంగాణ పర్యాటక శాఖ ఆదివారం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. మిస్ వరల్డ్ 2025 పోటీలు మన హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి.
ఇవీ అందాల పోటీలే కాదు
ఇవీ అందాల పోటీలే కాదు మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, మహిళా సాధికారత, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుకునే అవకాశం. అందాల సుందరులు,తెలివిగల ముద్దుగుమ్మలు ప్రపంచంలోని 120 దేశాల నుంచి తరలిరానున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే అందాల సుందరీమణులను నిఖత్ జరీన్ అభినందించార.ఈ పోటీలు మర్చిపోలేని విదంగా నిర్వహిద్దామంటూ నిఖత్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక ప్రాభవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించబోతున్నాం, హైదరాబాద్ జరూర్ ఆనా అంటూ నిఖత్ జరీన్ వీడియోలో కోరారు.
World champion, Telangana pride!
— Telangana Tourism (@TravelTelangana) May 4, 2025
Nikhat Zareen shares her excitement as Telangana gets ready to host the 72nd edition of Miss World right here in her home state!#MissWorld2025 #NikhatZareen #TelanganaZarurAana #72ndMissWorld pic.twitter.com/Uzdb6rfOJC