కొండెక్కిన టమోటా.. కోటీశ్వరుడైన మెదక్ రైతు టిప్స్ ఇవే
x

కొండెక్కిన టమోటా.. కోటీశ్వరుడైన మెదక్ రైతు టిప్స్ ఇవే

దిగుబడి తక్కువ ఉండటంతో టమోటా ధరలు బాగా పెరిగాయి. అన్ సీజన్ లో టమోటా పంటల నుండి లాభాలు ఎలా తెచ్చుకోవాలో మెదక్ రైతు కొన్ని టిప్స్ చెబుతున్నారు.


టమోటా ధరలు మరోసారి వేడెక్కాయి. సోమవారం జహీరాబాద్‌లో కిలో టమాటా రూ.100కి, ఖమ్మంలో రూ.100కి చేరుకోగా, ఆదివారం కిలో టమాటా రూ.80కి విక్రయిస్తున్నారు. కేవలం టమోటా మాత్రమే కాదు, ఉల్లిపాయలు, నిత్యావసర వస్తువులతో సహా ఇతర కూరగాయల ధరలు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నాయి. మెదక్ జిల్లాలో జూన్ మొదటి వారంలో రూ.30కి అమ్మిన టమోటా ధర వివిధ కూరగాయల మార్కెట్లలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది.

సాధారణంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని మార్కెట్‌లకు స్థానిక రైతుల నుంచి, అలాగే హైదరాబాద్‌లోని బోయినపల్లి, సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి మార్కెట్‌ల నుంచి కూడా టమోటాలు వస్తాయి. అయితే గత నెలలతో పోలిస్తే ఇక్కడి మార్కెట్లకు వచ్చే టమోటా క్వాంటిటీ తగ్గింది. మరోవైపు, 15 రోజుల క్రితం వరకు కిలో రూ.20 నుంచి రూ.25 వరకు అమ్ముడుబోయిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60కి చేరగా, బెండకాయ ధరలు కూడా కిలో రూ.80 నుంచి రూ. 100 కి చేరింది. మార్కెట్‌లో సరఫరా కొరత కారణంగా కూరగాయల ధరలు పెరిగినట్లు మార్కెట్ యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి.

కరీంనగర్‌లోనూ ఒక్కరోజులోనే రూ.20 పెరిగిన టమోటా కిలో రూ.100కి అమ్ముతున్నారు. సోమవారం కిలో రూ.80కి లభించే టమోటా మంగళవారం నాటికి మరో రూ.20 పెరిగి సెంచరీ కొట్టింది. సాధారణంగా ఇక్కడ టమాట కిలో రూ.20 నుంచి రూ.40 వరకు అమ్ముతారు. స్థానికంగా పండించిన పంటలు అందుబాటులో లేకపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. జిల్లాలో వడగళ్ల వానలు, అకాల వర్షాల కారణంగా కూరగాయల తోటలు దెబ్బతినడం, ఆ తర్వాత పంటపై విపరీతమైన ఉష్ణోగ్రతల ప్రభావం.. ఇవన్నీ దిగుబడిపై ప్రభావం చూపాయని రైతులు చెబుతున్నారు.

టమోటాలు అమ్మి కోటీశ్వరుడైన మహిపాల్ టిప్స్:

గతేడాది టమాటా అమ్మి కోట్లకు పడగలెత్తిన మెదక్ జిల్లా బాన్సువాడ మండలం కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్‌రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటారు. ఆయన టమోటాలు కొరత ఉన్న సమయంలో టమోటాలు కిలో రూ.200 లెక్కన అమ్మి నెల రోజుల్లోనే అక్షరాల కోటి ఎనభై లక్షలు సంపాదించాడు. ఆయనకి ఉన్నకొండెక్కిన టమోటా.. కోటీశ్వరుడైన మెదక్ రైతు టిప్స్ ఇవే

నలభై ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో కేవలం టమోటా పంట మాత్రమే సాగు చేశాడు. అయితే మార్కెట్ లో కొరత ఉండే సమయానికి టమోటా పంట చేతికి అందొచ్చేలా ఆయన పంటని సాగు చేయడమే అధిక లాభాలు రావడానికి కారణమని మీడియాకి తెలిపాడు. అదే స్పూర్తితో ఈ ఏడాది కూడా ఆయన 30 ఎకరాల్లో టమోటా పంట సాగు విస్తీర్ణం పెంచాడు.

మహిపాల్ రెడ్డి మార్కెట్‌లో కొరత ఏర్పడినప్పుడు పంట చేతికి వచ్చేలా టమాటా సాగు చేయడంలో నైపుణ్యం సాధించినట్లు చెబుతున్నారు. టమోటా పంటను ఏప్రిల్, మేలో సాగు చేస్తాడు. దీంతో జూన్, జూలై, ఆగస్టులలో పంట చేతికొస్తుంది. సాధారణంగా ఈ నెలల్లో మార్కెట్‌లోకి కూరగాయలు తక్కువగా సరఫరా అవుతాయి.

అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండని తట్టుకుని మొక్కలు బతకడం కష్టం కాబట్టి వేసవిలో టమోటా పంటల సాగుపై రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. షేడ్ నెట్‌ లో పంటను పండించడమే కాకుండా, అదనంగా ఉద్యానవన శాఖ అధికారుల సూచనలను అనుసరించి రైతులు నీరు, ఎరువులు వేయాల్సిన అవసరం ఉందన్నారు.

విత్తనాలు కొనుగోలు చేయడం నుంచి కూలీలు, పైర్లు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా వరకు రైతులు ప్రతి ఎకరా పంటకు దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా వానాకాలం, చలికాలంలో రైతులు ఎకరం టమోటా పంటపై రూ.2 లక్షల లోపు పెట్టుబడి పెడతారు. అయితే వానాకాలం, చలికాలంలో ఎకరాకు 35 టన్నుల దిగుబడి వస్తే ఈ కాలంలో దిగుబడి 15 నుంచి 17 టన్నుల వరకు ఉంటుందన్నారు. కానీ అధిక ధరలు ఉంటాయి కాబట్టి పంట దిగుబడి తగ్గినా నష్టం ఉండదన్నారు.

ఎండవేడిమి నుంచి పంటను కాపాడుకోవడానికి షేడ్ నెట్ లేకపోతే పంట పూలు రాలిపోయేవి. 30 నుండి 45 రోజుల పంటను ఇచ్చే మెజారిటీ కూరగాయల పంటల మాదిరిగా కాకుండా, టమోటాలు 70 రోజుల తర్వాత దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తాయి. 90 రోజుల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటాయి అన్నారు. ఇక ఎండాకాలం తర్వాత, వానాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటను తట్టుకోవాల్సిన అవసరం ఉందని మహిపాల్ రెడ్డి తెలిపారు.

Read More
Next Story